Honeymoon Bed : హనీమూన్ బెడ్..ఒక దిండు ఒక దేశంలో మరో దిండు ఇంకో దేశంలో..

అదొక అద్భుతమైన బెడ్. ఆ మంచంమీద దిండు ఒక దేశంలో ఉంటే మరో దిండు మరో దేశంలో ఉంటుంది. రెండు దిండ్లకు రెండే దేశాల చెండాల డిజైన్. ఈ బెడ్ హనీమూన్ కపుల్స్ కు మంచి రొమాంటిక్ స్పాట్ గా..

Honeymoon Bed : హనీమూన్ బెడ్..ఒక దిండు ఒక దేశంలో మరో దిండు ఇంకో దేశంలో..

Famous Honeymoon Bed In Hotel Arbez

Famous Honeymoon Bed : పెళ్లి అయ్యింది. హనీమూన్ ఎక్కడకు వెళ్లాలా? అని కొత్త జంటలకు ప్లాన్స్ వేసుకుంటారు. భార్య స్విట్జర్లాండ్ వెళదామంటుంది. భర్త కాదు ఫ్రాన్స్ వెళదామంటాడు. కానీ వీరిద్దరి కోరికా ఒకేసారి నెరవేర్చే ఓ హోటల్ ఉంది. ఎందుకంటే ఈ హోటల్ రెండు దేశాలకు మధ్యలో ఉంది.ఈ హోటల్ లో ఉన్న ఓ సూట్ బుక్ చేసుకుంటే కొత్త జంట కోరిక నెరవేరినట్లే. ఎలాగంటే..ఈ హోటల్ లో ఓ రూం కు సంబంధించి రూమ్ మొత్తం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటే.. దాని బాత్‌రూమ్ మాత్రం ఫ్రాన్స్‌లో ఉంటుంది.అలా కొత్త జంట కోరిక నెరవేరినట్లే కదా..అటు స్విట్జర్లాండ్ లోను ఇటు ఫ్రాన్స్ లోను హనీమూన్ జరుపుకున్నట్లు ఉంటుంది. అలా ఒకేసారి రెండు దేశాల్లో హ‌నీమూన్ జ‌రుపుకున్నట్లు ఉంటుంది.

The Surprising Meaning Of Honeymoon Explained - Dictionary.com

ఒకే బెడ్‌పై ఉండి ఒక‌ దేశం నుంచి మ‌రో దేశానికి ఏమాత్రం ఖర్చులేకుండా ఎంచక్కా రెండు దేశాలకు మారిపోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక కాలు ఒక దేశంలోను..మరో కాలు మరో దేశంలోను పెట్టొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? క‌లిసి స్విట్ల‌ర్లాండ్‌కు టికెట్ బుక్ చేసేసుకోండి.ఇంతకీ ఈ రెండు వేర్వేరు దేశాల్లో కొత్త జంట ఎంజాయ్ చేసే ఆ హోటల్ ఏంటీ అంటారా?అదే స్విట్జ‌ర్లాండ్‌లోని హోట‌ల్ అర్బెజ్‌.

Hotel Arbez | Fact | FactRepublic.com

ఇది ఒక‌ప్పుడు వాల్లీ డెస్ డ‌ప్పెస్ అనే ప్రాంతం స్విట్జ‌ర్లాండ్ ఆధీనంలో ఉండేది. ఆ ప్రాంతాన్ని త‌మ దేశంలో క‌లుపునేందుకు ఫ్రాన్స్ చాలాసార్లు ప్ర‌య‌త్నించింది. కానీ ఫలితం లేదు.దీంతో చివ‌రి ప్ర‌య‌త్నంగా 1862లో ఫ్రాన్స్ స్విట్జ‌ర్లాండ్ తో త‌మ‌కు ఆ ప్రాంతం అప్ప‌గిస్తే అంతే విస్తీర్ణం ఉన్న మ‌రో ప్రాంతాన్ని మీదేశానికి హ్యాండోవర్ చేస్తామని చెప్పింది.దీనికి స్విట్జ‌ర్లాండ్ కూడా ఇంకా ఎంతకాలం ఈ వివాదం అనుకుందో ఏమోగానీ..అంగీక‌రించింది. లా క్యూర్ గ్రామంలోని కొంత భూభాగాన్ని ఫ్రాన్స్‌కు ఇచ్చేసింది. దీంతో లా క్యూర్ గ్రామం రెండుగా చీలిపోయింది. కొంతభాగం ఫ్రాన్స్ లో..మరొకొంత భాగం స్విట్జర్లాండ్ లో ఉంది.

Read more : Pakistan New Rule: ఉపాధ్యాయులు జీన్స్,టీ షర్టులు ధరించకూడదు..పాకిస్తాన్ సర్కార్ హుకుం

HOTEL ARBEZ FRANCO-SUISSE (La Cure) - Hotel Reviews, Photos, Rate Comparison - Tripadvisor

దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు కొంత‌మంది ప్ర‌జ‌లు ఫ్రాన్స్‌లోనే ఉండిపోగా.. మ‌రికొంత‌మంది స్విట్జ‌ర్లాండ్ పౌరులుగా మారిపోయారు. మరేం చేస్తారు. ఎవరైనా గ్రామ సరిహద్దుల విషయంలో ఇటువంటి సమస్యలొస్తాయి. కానీఈ గ్రామస్తులకు మాత్రం రెండు దేశాలకు చెందినవారిగా మారిపోవాల్సి వచ్చింది పాలకులు తీసుకున్న నిర్ణయం వల్ల.ఈ ఒప్పందం ప్ర‌కారం.. కొత్త‌గా ఏర్పాట‌య్యే స‌రిహ‌ద్దు మ‌ధ్య‌లో ఉన్న ఏ భ‌వ‌నాలుకానీ..ఇత‌ర నిర్మాణాల‌ను డివైడ్ చేయటానికి లేదు. కూల్చివేయ‌డానికి అంతకంటే వీల్లేదు. ఈ నిబంధ‌న‌ను ఆస‌రాగా చేసుకున్న ఫ్రాన్స్‌కు చెందిన పొంతుస్‌ అనే ఓ బడా వ్యాపారి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశాడు.

Hotel Arbez – Lets eat sunshine.nl

రెండు దేశాల స‌రిహ‌ద్దుల మ‌ధ్య‌లో ఒక బిల్డింగ్ ఉంటే అంద‌ర్నీ ఆక‌ర్షించవచ్చు..తద్వారా తన వ్యాపారం ఇంటర్నేషనల్ గా ఫేమస్ అవ్వొచ్చు అని ఆలోంచించాడు. అలా ప్ర‌భుత్వం స‌రిహ‌ద్దులు మార్చ‌ే ప్రక్రియకు ముందే శ‌ర‌వేగంగా మూడంత‌స్తుల భ‌వ‌నాన్ని కట్టించేశాడు. ఆ త‌ర్వాత ఈ బిల్డింగ్‌కు ఒక‌వైపు గ్రాస‌రీ షాపు, మ‌రో వైపు బార్‌ను ఉండేలా ప్లాన్ వేశాడు. ఇక రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో ఇది శ‌ర‌ణార్థుల‌కు, ఫ్రాన్స్ సైనికుల‌కు ఆశ్ర‌యంగా మారింది. ఆ త‌ర‌ువాత 1921 నాటికి పొంతుస్ వార‌సులు ఈ భ‌వ‌నాన్ని జులెస్ జీన్స్ ఆర్బెజ్ అనే వ్య‌క్తికి అమ్మేశారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఈ బిల్డింగ్‌ను ఆర్బెజ్‌ త‌న తెలివితో హోట‌ల్‌గా మార్చేశాడు.

The hotel that lets you sleep in two countries at the same time | Travel News | Travel | Express.co.uk
తొలిరేయికి మ‌రిచిపోలేని మ‌ధురానుభూతి ‘హోటల్ ఆర్బెజ్‌’
రెండు దేశాల మ‌ధ్య ఉన్న ఈ హోట‌ల్ టూరిస్టుల్ని..కొత్త జంటల్ని భలే ఆకర్షిస్తోంది.ఈ హోట‌ల్‌లోని కిచెన్‌, డైనింగ్ రూం, హాల్ తో పాటు పలు రూమ్ లు రెండు దేశాల సరిహ‌ద్దుల కింద‌కు వ‌స్తాయి. ముఖ్యంగా ఈ హోట‌ల్‌లోని హనీమూన్ సూట్‌ గురించి చెప్పుకోవాల్సిందే. ఈ హోటల్ లో ఇదే సెంటారాఫ్ ఎట్రాక్షన్.

Hôtel Arbez Franco-Suisse - La Côte Region - Tourist Office

ఈ సూట్ లో బెడ్ మ‌ధ్య‌లో నుంచి స‌రిహ‌ద్దు రేఖ ఉంటుంది. అంటే స‌గం బెడ్ ఫ్రాన్స్‌లో ఉంటే.. ఇంకో స‌గం బెడ్ స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటుంది. ఇదే విష‌యాన్ని సింబాలిక్‌గా చెప్పేందుకు బెడ్‌పై ఉండే రెండు దిండ్ల‌లో ఒకదానికి ఫ్రాన్స్‌, మ‌రొక దానికి స్విట్జ‌ర్లాండ్ జాతీయ ప‌తాకాల‌ను పోలిన బెడ్ క‌వ‌ర్ల‌ను తొడుగుతారు హోటల్ యాజమాన్యం. అంటే.. కొత్త‌గా పెళ్ల‌యిన జంట ఈ హోట‌ల్‌లో హ‌నీమూన్‌కి వెళ్తే.. దంప‌తులిద్ద‌రిలో ఒక‌రు ఫ్రాన్స్‌లో.. మ‌రొక‌రు స్విట్జ‌ర్లాండ్‌లో ప‌డుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఇలాంటి వింతైన అనుభూతి ద‌క్కుతుండ‌టంతో ఈ హోట‌ల్‌లో హ‌నీమూన్ జ‌రుపుకునేందుకు కూడా చాలా జంట‌లు ఆస‌క్తి చూపిస్తున్నాయి.

Hotel Arbez- On the border of Switzerland and France - StrikingStuff.com

ఈ హోట‌ల్‌లోని రెస్టారెంట్ స‌గం ఫ్రాన్స్‌లో ఉంటే.. మ‌రో స‌గం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటుంది.
బార్ మొత్తం ఫ్రాన్స్‌లో ఉంటే దాని ఎంట్ర‌న్స్ డోర్‌ మాత్రం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంది. బిల్డింగ్‌లోని మెట్ల‌లో కింది స‌గం ఒక దేశంలో ఉంటే..మిగిలిన స‌గం ఇంకో దేశం కింద‌కొస్తాయి. ఒక రూం విష‌యానికొస్తే ఆ గ‌ది మొత్తం స్విట్జ‌ర్లాండ్‌లో ఉంటే.. దాని బాత్‌రూమ్ ఒక్క‌టి ఫ్రాన్స్‌లో ఉంటుంది. అందుకే ఈ హోటల్ అడ్రస్ కూడా రెండు దేశాలకు చెందినదే ఉంటుంది. ఈ హోట‌ల్ అడ్ర‌స్‌ను ఇరు దేశాలు త‌మ దేశంలో ప్రదర్శిస్తాయి. అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ కూడా హోట‌ల్ మేనేజ్‌మెంట్ రెండు దేశాల‌కు స‌మానంగా చెల్లిస్తుంది.భలే బాగుంది కదూ..ఈ రెండు దేశాల మధ్యా హోటల్. ముఖ్యంగా ఒకే బెడ్ రెండు దేశాల దిండ్లు. కొత్తదనం కోరుకునే కొత్త జంటకలు ఈ బెడ్ మీద హనీమూన్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందని అనటంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు.