Imran Khan : మహిళలు పొట్టి బట్టలు వేసుకోవటం వల్లే అత్యాచారాలు..మగవాడు రోబో అయితే తప్ప..

మహిళలు ధరించే దుస్తులపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. ‘‘మహిళలు పొట్టి పొట్టి బట్టలు..గుడ్డపీలికల్లాంటి దుస్తులు ధరిస్తే ఆ ప్రభావం మగవారిపై తప్పకుండా ఉంటుందని వ్యాఖ్యానించారు.

Imran Khan : మహిళలు పొట్టి బట్టలు వేసుకోవటం వల్లే అత్యాచారాలు..మగవాడు రోబో అయితే తప్ప..

Clothing For Rapes In Pakistan (1)

clothing for rapes in Pakistan : మహిళలు ధరించే దుస్తులపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి నోరు పారేసుకున్నారు. గతంలో దేశంలో ఆత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి మహిళల వస్త్రధారణే కారణమని వ్యాఖ్యానించి ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన నోటికి పని కల్పించారు. ఓ ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..

‘‘మహిళలు గుడ్డపీలికలు కట్టుకుంటే మగవారిపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని మహిళలు పొట్టి పొట్టి బట్టలు..గుడ్డపీలికల్లాంటి దుస్తులు ధరిస్తే ఆ ప్రభావం మగవారిపై తప్పకుండా ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు మహిళలు ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకుంటే చూసిన మగవారు రోబోలైతే తప్ప… ఇది మనకు ఉండాల్సిన ఇంగిత జ్ఞానం అంతే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జర్నలిస్టులతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా మండిపడ్డారు.

మహిళలపై ఆయనకు ఏపాటి గౌవరముందో తెలుస్తోందంటూ ఏకిపారేస్తున్నారు.పాకిస్థాన్ లో పెరిగిపోతున్న అఘాయిత్యాలను మహిళల వస్త్రధారణతో ప్రధాని ఇమ్రాన్ మరోసారి ముడిపెట్టడం చాలా దారుణం అని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జూరిస్ట్స్ లీగల్ అడ్వైజర్ రీమా ఒమర్ అసహనం వ్యక్తం చేశారు.

దీనిపై ఇమ్రాన్ సోషల్ మీడియా వ్యవహారాలు చూసే అధికార ప్రతినిధి డాక్టర్ అర్ స్లాన్ ఖాలిద్ ఖండించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఇమ్రాన్ ఏ సందర్భంగా అలా అన్నారు అనే విషయాన్ని పూర్తిగా చెప్పకుండా కేవలం ఒక వాక్యాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని..రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మనం ఎటువంటి సమాజంలో జీవిస్తున్నామో..ఎటువంటివి చూస్తే లైంగిక వాంఛలు ఏ స్థాయికి వెళ్తాయోనని ప్రధాని అన్నారని..కానీ ఆయన మాటల్ని వక్రీకరించి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.