UNO : అఫ్ఘాన్‌కు ఐక్యరాజ్యసమితి 2 కోట్ల డాలర్ల ఆర్థికసాయం

అఫ్ఘాన్‌ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అఫ్ఘాన్‌లో ఉన్న తమ సిబ్బంది వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తారని తెలిపింది.

UNO : అఫ్ఘాన్‌కు ఐక్యరాజ్యసమితి 2 కోట్ల డాలర్ల ఆర్థికసాయం

Uno

Updated On : September 14, 2021 / 8:32 AM IST

UNO financial aid to Afghanistan : అఫ్ఘాన్‌ ప్రజలను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. అఫ్ఘాన్‌లో ఉన్న తమ సిబ్బంది వీటిని ప్రజల కోసం ఉపయోగిస్తారని తెలిపింది. అమెరికా-తాలిబన్లల మధ్య ముగిసిన రెండు దశాబ్దల యుద్ధం తర్వాత అప్ఘాన్‌ ప్రజల దుస్తితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. అఫ్ఘాన్‌ ప్రజలను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

అటు అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఆ దేశానికి పేదరికం ముప్పు మరింత పెరిగిందన్నారు భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌. ఇలాంటి సమయంలో అఫ్ఘాన్‌కు అండగా నిలబడడానికి భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Malala :ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలి..అఫ్గన్‌లో మహిళల దుస్థితిపై మలాలా పిలుపు
అఫ్ఘాన్‌లో నెలకొన్న మావన సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అత్యున్నత సమావేశంలో భారత్‌ పాత్రను జైశంకర్‌ వెల్లడించారు. అఫ్ఘాన్‌లో పేదరికం 72శాతం నుంచి 97శాతానికి పెరిగే ప్రమాదముందంటూ ఐక్యరాజ్య సమితి వేసిన అంచనాలను ఆయన మరోసారి గుర్తుచేశారు.