Malala :ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలి..అఫ్గన్‌లో మహిళల దుస్థితిపై మలాలా పిలుపు

అఫ్గనిస్తాన్‌ ని తాలిబన్లు హస్తగతం చేసుకోవటం, బాలికలు,యువతులు మహిళల రక్షణపై మలాలా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు..

Malala :ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలి..అఫ్గన్‌లో మహిళల దుస్థితిపై మలాలా పిలుపు

Takeover Taliban Control Malala Worries For Women In Afghanistan

takeOver Taliban Control Malala Worries For Women In Afghanistan : అఫ్గనిస్తాన్‌ ని తాలిబన్లు హస్తగతం చేసుకోవటంతో మరోసారి ఆఫ్గాన్ ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితులను నెట్టివేయబడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బాలికలు,యువతులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు తమ కర్కరకాండకు తెరతీశారు. ఇటువంటి అత్యంత దారుణ పరిస్థితులపై పాకిస్తానీ హక్కుల కార్యకర్త, బాలికల చదువుకోవాలనే పోరాటం చేసిన మలాలా..నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

అఫ్గాన్ దేశంలో ఉంటున్న మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశారు. ట్విట్టర్ వేదికగా ఆమె తాలిబన్ల అరాచకాలతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం చూసి షాక్‌కు గురయ్యాను. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి మహిళలు, మైనారిటీలు, హక్కుల కార్యకర్తల రక్షణపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు. అఫ్గాన్ పరిస్థితిపై ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు. తక్షణమే కాల్పుల విరమణ అమలయ్యేలా చూడాలనీ.. శరణార్ధులు, పౌరులకు భద్రత కల్పించి, మానవతాసాయం అందజేయాలి’ అని మలాలా కోరారు.

కాగా..బాలికలు చదువుకోవాలంటూ పాకిస్థాన్ లోని స్వాత్‌ ప్రాంతంలో మలాలా ఉద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆమెను టార్గెట్ చేసిన తాలిబన్లు 2012లో మలాలాపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె సుదీర్ఘ కాలం చికిత్స పొంది కోలుకున్నారు. పాకిస్థాన్ వస్తే చంపేస్తామని తాలిబన్లు మలాలాను హెచ్చరించారు. దీంతో ఆమె ప్రస్తుతం యూకేలోనే ఉంటున్నారు.

తాలిబన్లు అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను నలువైపుల నుంచి చుట్టుముట్టారు. తాలిబన్లు పూర్తిగా రాజధానిలోకి చొచ్చుకురావడంతో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. తాలిబన్లు అద్యక్ష భవనం వైపు కదులుతున్నాన్న సమాచారం రావడంతో.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఘనీ కాబూల్ నుంచి నేరుగా తజికిస్తాన్‌కు వెళ్లినట్టుగా అఫ్గాన్ అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే అక్కడి నుంచి అష్రఫ్ ఘనీ వేరే దేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అరాచకాలతో బాలికలు, యువతులు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. దీంతో కట్టుబట్టలతో దేశం విడిచిపోయేందుకు నానా తంటాలు పడుతున్నారు.స్త్రీలకు విద్య నిషేదించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను తుడిచిపెట్టేయడం, లైంగిక బానిసలుగా మార్చేయడం వంటివి తలుచుకోగానే ప్రస్తుత అఫ్గాన్‌ మహిళా సమాజం ఉలిక్కిపడుతుంది. తమ భవిష్యత్తుతలచుకుని ఆందోళన వ్యక్తం చేస్తోంది.