Afghanistan : ధైర్యం చేసి ఉద్యోగంలో చేరిన అఫ్ఘాన్ మహిళలు

అఫ్ఘాన్ మహిళలపై తాలిబన్లు కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.మహిళలు ఉద్యోగాలు చేయడానికి వీలు లేదని తెలిపారు. అయితే వీరి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొందరు మహిళలు ఉద్యోగంలో చేరారు

Afghanistan : ధైర్యం చేసి ఉద్యోగంలో చేరిన అఫ్ఘాన్ మహిళలు

Afghanistan (4)

Afghanistan : అఫ్ఘాన్ తాలిబన్ల వశమైన తర్వాత అక్కడి మహిళలపై కఠిన ఆంక్షలు విధించారు. ఇల్లు వదిలి బయటకు రావద్దని హెచ్చరించారు. ఉద్యోగాలు, క్రీడలకు కూడా అనుమతించలేదు. అయితే ఓ మహిళ మాత్రం ఉద్యోగం చేసేందుకు దైర్యం చేసింది.అఫ్ఘాన్ తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత మహిళలు ఉద్యోగాలు మానేశారు.

Read More : Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రబియా జమాల్ (35) అనే మహిళ దైర్యం చేసి ఉద్యోగంలో చేరింది. కాబుల్ విమానాశ్రయంలో మహిళా సిబ్బంది పనిచేయడాన్ని ఓ వార్త సంస్థ గుర్తించింది. అందులో రబియా జమాల్ ఒకరు. ఆమె 11 ఏళ్లుగా కాబుల్ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.

రబియా స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తనకు ముగ్గురు పిల్లలని.. ఉద్యోగం మానేయడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని. అందుకే తిరిగి విధుల్లో చేరానని పేర్కొన్నారు. అఫ్ఘాన్ ను తాలిబన్లు ఆక్రమించక ముందు ఇక కాబుల్ విమానాశ్రయంలో మొత్తం 80 మంది మహిళా సిబ్బంది ఉండేవారు.. కానీ ప్రస్తుతం 12 మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు.

Read More : Vaccine : టీకా తీసుకోకుండా పబ్‌కి వచ్చిన కూతురు.. వెనక్కు పంపిన యజమాని

తాలిబన్లు, మహిళలు ఉద్యోగంలో చేరేందుకు అనుమతించిన కొద్దీ మందిలో వీరున్నారు. ఇక మిగిలిన మహిళలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విధుల్లో చేరేందుకు అనుమతి లేదని తెలిపింది. విమానాశ్రయంలో మహిళలను తనిఖీ చేసే పని ఉంటుంది కాబట్టి ఈ 12 మందికి తాలిబన్లు అనుమతి ఇచ్చారు.