Vaccine : టీకా తీసుకోకుండా పబ్‌కి వచ్చిన కూతురు.. వెనక్కు పంపిన యజమాని

వ్యాక్సిన్ తీసుకోలేదని కూతురిని పబ్ లోకి అనుమతించలేదు తల్లి. ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

Vaccine : టీకా తీసుకోకుండా పబ్‌కి వచ్చిన కూతురు.. వెనక్కు పంపిన యజమాని

Vaccine (2)

Vaccine : కరోనా టీకా తీసుకోలేదని కూతురికి పబ్ లోకి అనుమతించలేదు యజమాని. ఈ సంఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.  కరోనా కారణంగా బ్రిటన్ లో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా కాలంగా వ్యాపారాలు మూతపడ్డాయి. తాజాగా ఆంక్షలు తొలగించడంతో ఇప్పుడిప్పుడే వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయి.

Read More : Gazette Conflict : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలపై గెజిట్ అమలు చేస్తారా? గడువు ఇస్తారా?

ఇక ఈ నేపథ్యంలోనే పబ్ లను కూడా ఓపెన్ చేశారు. పబ్ కి వెళ్లాలంటే కరోనా టీకా తీసుకోవడం తప్పనిసరి. అయితే ఓ యువతి టీకా తీసుకోకుండా పబ్ కి వచ్చింది. దీంతో యువతిని ఆమె తల్లి, పబ్ యజమానురాలు షెల్లీ జోన్స్ అడ్డుకున్నారు. సారీ నిన్ను లోపలి అనుమతించలేను అని ముఖంమీదే చెప్పేసింది.

Read More : Medvedev : యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌.. జకోవిచ్‌కు నిరాశ

తమ పబ్‌కు వయసుపైబడిన వారు కూడా వస్తుంటారని, టీకా వేయించుకోని వారి వల్ల అలాంటి వారు అనారోగ్యానికి గురి కావడం తమకు ఇష్టం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్‌ తెలిపారు. మహమ్మారి కాలంలో వృద్ధులు, రోగాల బారినపడే అవకాశమున్న కస్టమర్లను రక్షించడానికి తమ పబ్ ప్రయత్నిస్తోందని చెప్పారు. కన్నా కూతురిని అడ్డుకొని కరోనా నిబంధనల అమలులో నిదర్శనంగా నిలిచిన ఈ పబ్‌ యజమానిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.