టిక్ టాక్ స్టార్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్

  • Publish Date - October 3, 2019 / 10:56 AM IST

టిక్ టాక్ లు చేస్తూ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న స్టార్ సోనాలి ఫోగాట్ కు  బీజేపీ టిక్కెట్ కేటాయించింది. హర్యానా రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతుండగా ఆమె బీజేపీ టిక్కెట్ దక్కించుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీ 12మందితో సెకెండ్ లిస్ట్ ను బీజేపీ విడుదల చేయగా అందులో ఫోగట్ పేరు ఉంది. కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్ కు కంచుకోట అయిన  కాంగ్రెస్ కు ఆడంపూర్ అసెంబ్లీ సీటు నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.

టిక్‌టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకుని ఉన్న ఫోగట్.. కొన్ని సీరియళ్లలో కూడా నటించారు. సోనాలి భర్త సంజయ్ ఫోగట్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.. ఆయన మరణం తరువాత సోనాలి కూడా భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమెను పార్టీ రాష్ట్ర మహిళా మోర్చ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించింది బీజేపీ.

ఇప్పుడు ఆడంపూర్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించింది. ఇదిలా ఉంటే ఇదే సీటు నుంచి కుల్దీప్ బిష్ణోయ్ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. 2014లో కుల్దీప్ బిష్ణోయ్ ఈ సీటు నుండి ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో భజన్‌లాల్ ఈ సీటు నుంచి తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 90స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో అక్టోబర్ 21వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. 24వ తేదీ ఫలితాలు విడుదల కానున్నాయి.