New Liquor Policy: ఆఫీసుల్లో మద్యం తాగొచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.. షరతులు ఏమిటంటే?

ప్రభుత్వం అనుమతి ఉందికదా అని ఏ ఆఫీసు పడితే ఆ ఆఫీసులోకి మద్యాన్ని తీసుకెళ్లి తాగడం కుదరదు. అందుకు ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది.

Haryana New Liquor Policy

New Liquor Policy: హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కార్పొరేట్ ఆఫీసు క్యాంటిన్లలో మద్యం తాగొచ్చని చెప్పింది. అంతేకాదు, అమేరకు ఉత్తర్వులుసైతం జారీ చేసింది. ఈ సదుపాయం జూన్ 12 నుంచి అమల్లోకి వస్తుంది. తాజాగా 2023 -24 సంవత్సరాలకుగాను రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే అన్ని ఆఫీసుల్లోనూ మద్యానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.. మద్యం అంటే మరీ కిక్కు ఇచ్చే మద్యం కాదు. తక్కువ మోతాదు ఆల్కాహాల్ ఉండే బీర్, వైన్ వంటి డ్రింక్స్ కు మాత్రమే ఆఫీసుల్లోకి అనుమతి ఉంటుంది.

Tamil Nadu : తమిళనాడులో విషాదం.. కల్తీ మద్యం తాగి 13 మంది మృతి

నిబంధనలు ఇలా..

ప్రభుత్వం అనుమతి ఉందికదా అని ఏ ఆఫీసు పడితే ఆ ఆఫీసులోకి మద్యాన్ని తీసుకెళ్లి తాగడం కుదరదు. అందుకు ప్రభుత్వం కొన్ని కండీషన్స్ పెట్టింది. కార్పోరేట్ ఆఫీసులో కనీసం 5వేల మంది ఉద్యోగులు ఉండాలి. కార్యాలయంలో లక్ష ఫీట్ల ఆవరణ ఉండాలి. క్యాంటిన్ సైతం 2వేల ఫీట్లతో ఉండాలి. రూ. 10లక్షల ఫీజు కడితేనే ఆ కంపెనీకి ఆఫీసులో మద్యం తాగేందుకు అనుమతిస్తారు.

Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు బరితెగింపు తనానికి ఉదాహరణ అదే..! వారంతా ఏకమై దాడి మొదలు పెట్టారు

కార్పోరేట్ ఆఫీసుల్లో బయటకు వెళ్లి వీకెండ్ పార్టీలు చేసుకోవటం ఉద్యోగులకు మామూలే. తాజాగా హర్యానా ప్రభుత్వం కార్పొరేట్ ఆఫీసుల్లో వర్క్ విత్ బీర్, వర్క్ విత్ వైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.