ఆరోగ్య మంత్రిపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం

Haryana Minister Anil Vij to take trial dose of Covaxin కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్​ బయోటెక్​ సంస్థ “కొవాగ్జిన్​ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ “కొవాగ్జిన్” ట్రయిల్ డోస్ ని తనపై ప్రయోగించుకునేందుకు హర్యాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్ సిద్ధమయ్యారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్​ సివిల్ హాస్పిటల్ లో వ్యాక్సిన్​ డోస్​ను తీసుకోనున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్​ లో ప్రకటించారు.



పీజీఐ రోహ్​తక్ వైద్యుల బృందం సమక్షంలో ఈ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలిపారు. కొవాగ్జిన్​ టీకా మూడో దశ ప్రయోగాల కోసం బుధవారమే…వలంటీరుగా నమోదు చేయించుకున్నారు అనిల్​ విజ్​. మరోవైపు,దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేసే ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారని భారత్​ బయోటెక్​ తెలిపింది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు సంస్థ పేర్కొంది. భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్​) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలో భారత్​ బయోటెక్​ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్​ పరీక్ష ఇదే కానుండటం విశేషం.