మన దేశానికే చెందిన ఇద్దరు అక్కాచెల్లెలకు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించారు అధికారులు. అయితే పాస్ పోర్టు ఎందుకు నిరాకరించే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చూడటానికి నేపాలీలా కన్పిస్తున్నారంటూ వారికి అధికారు పాస్ పోర్ట్ ఇచ్చేందుకు నిరాకరించిన ఘటన చంఢీఘర్‌లో చోటు చేసుకుంది.
హర్యానాకు చెందిన భగత్ బహదూర్ అనే వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లు సంతోష్, హీన్నాను తీసుకుని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. పాస్‌పోర్టు కోసం బహదూరు కూతుళ్లు ఇద్దరు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే మీరిద్దరూ నేపాలీ అమ్మాయిల్లా కనిపిస్తున్నారు. మీకు పాస్‌పోర్టు ఇవ్వలేమని ఆ దరఖాస్తుపై అధికారులు రాశారు. మీ జాతీయతను నిరూపించుకోవాలని వారికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో బాధిత యువతి ఈ విషయాన్ని హర్యానా మంత్రి అనిల్ విజ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాధిత యువతులకు పాస్‌పోర్టు ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఇద్దరు యువతులకు పాస్‌పోర్టు రానుందని అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్ శర్మ తెలిపారు.. ఇద్దరు అక్కాచెల్లెలకు పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరించిన ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అశోక్ శర్మ తెలిపారు.