Haryana Health Infra : కరోనా థర్డ్ వేవ్.. ఆరోగ్య సౌకర్యాలను పెంచడంపై హర్యానా ఫోకస్..

రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చడంపై హర్యానా ప్రభుత్వం దృష్టిపెట్టింది. గుర్గావ్‌లో వరుసగా రెండవ వారంలో కరోనా నుంచి ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి.

Haryana To Focus On Boosting Health Infra

Haryana Health Infra : రాష్ట్రంలో కరోనా వ్యాప్తితో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చడంపై హర్యానా ప్రభుత్వం దృష్టిపెట్టింది. గుర్గావ్‌లో వరుసగా రెండవ వారంలో కరోనా నుంచి ఎక్కువ రికవరీలు నమోదయ్యాయి. అయినప్పటికీ ప్రస్తుత వైద్యపరమైన సమస్యలను ఎదుర్కోవటానికి జిల్లాలో ఆరోగ్య సౌకర్యాలను పెంచనున్నట్టు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ తెలిపారు. సెకండ్ వేవ్ తర్వాత రాబోయే మూడవ వేవ్ విషయంలో కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.

జిల్లాలో రెండు కోవిడ్ కేర్ సౌకర్యాలను సీఎం ఖత్తర్ ప్రారంభించారు. హర్యానాలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన రోజువారీ బులెటిన్ గణాంకాల ప్రకారం.. గత వారం 28,414 మంది కోలుకోగా, కొత్త కేసుల సంఖ్య 16,013గా నమోదైంది. మునుపటి వారంలో, మే 3, మే 9 మధ్య, రికవరీల సంఖ్య 27,603కు చేరుకుంది. ఇక కొత్త కేసుల సంఖ్య 25,860గా నమోదైంది. దాదాపు ఒక నెలలో మొదటిసారిగా, వారానికి 20వేల కంటే తక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఏప్రిల్ 12, ఏప్రిల్ 18 మధ్య వారంలో 11,584 కొత్త కేసులు నమోదయ్యాయి.

గత కొన్ని రోజులుగా, రెండో వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. హర్యానాలో కరోనా కేసులు 3వేల నుంచి 2,500 తగ్గిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో సుమారు 95,000
యాక్టివ్ కేసులు ఉన్నాయి. అంతకుముందు 1.16 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పరీక్షల సంఖ్య 18.7శాతం పడిపోయింది. నమోదైన కొత్త కేసుల సంఖ్య
38శాతానికి పడిపోయింది. మే 3 నుంచి మే 9 మధ్య 90,782 టెస్టులు నిర్వహించగా, గత వారం మొత్తం 73,728 టెస్టులు నిర్వహించారు. కోవిడ్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గుర్గావ్‌లో గత వారంలో అత్యధిక మరణాల సంఖ్య 96గా నమోదైంది. మే 15న 18 మంది వ్యాధి బారిన పడగా.. జిల్లాలో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. గత రెండు వారాల్లో హర్యానాతో పాటు గుర్గావ్‌లో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు. ఆస్పత్రుల విస్తరణ, కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం, పడకలు, ఇతర ఆరోగ్య సదుపాయాలను కల్పించనున్నారు. గుర్గావ్ పట్టణ ప్రాంతాల్లో మూడు కోవిడ్ కేర్ సెంటర్లను సీఎం ఖత్తర్ ప్రారంభించారు. కోవిడ్ బాధితులకు మరో 500 పడకల సామర్థ్యం ఉందని తెలిపారు.