Has Bjp Taken Lease Of Hindu Dharma ..tmc Mahua Moitra
Goddess Kali row : కాళీ దేవి వేషంలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించిన ‘కాళి’ అనే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ దర్శకురాలు లీనా మణిమేకలైకు మద్దతుగా మాట్లాడారు. కాళీకా మాత మాంసాహారం, మద్యం స్వీకరించే దేవతే అని ఆమె అన్నారు. మీ దేవతను ఊహించుకునే స్వేచ్ఛ మీకు ఉంది. నాకు కాళీ మాంసాహారం, మద్యం స్వీకరించే దేవత. కొన్ని ప్రదేశాల్లో మద్యాన్ని దేవతలకు నైవేద్యంగా పెడతారు. కానీ అది ఇతర ప్రదేశాల్లో దైవదూషణ అవుతుందని మోయిత్రా చెప్పుకొచ్చారు. దీంతో మోయిత్రా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినా ఆమె ఏమాత్రం తగ్గటంలేదు. తనదైన శైలిలో మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు.
Also read : ‘Smoking Kaali’ : సిగిరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్..డైరెక్టర్ ని అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్
బెంగాల్లో ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడిన ఎంపీ మోయిత్రా..బీజేపీ నుంచి ఎదురవుతున్న విమర్శలపై మాట్లాడుతూ..హిందూ ధర్మాన్ని ఆ పార్టీ ఏమైనా లీజుకు తీసుకుందా..? దేవుళ్లను ఎలా ప్రార్థించాలో ఎలా పూజించాలో బీజేపీ ఇతరులకు ఎందుకు చెబుతోంది? మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దాలను ఎందుకు యత్నిస్తున్నారు? అని ప్రశ్నించారు. పూజలు ఎలా చేయాలో నేర్పించటానికి బీజేపీ ఎవరు? అంటూ ప్రశ్నించారు.కాళీ మాత, రాముడు, హనుమంతుడు బీజేపీకి చెందినవారు కాదనే విషయం తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. హిందూ ధర్మాన్ని బీజేపీ లీజుకు తీసుకున్నట్లుగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. గత ఏడాది (2021) పశ్చిమ బెంగాల్ లో బీజేపీని ఎలా ఓడించిందో ఓ సారి గుర్తు చేస్తూ..”ఇది బయటి వ్యక్తుల పార్టీ తన హిందూత్వ రాజకీయాలను రుద్దడానికి ప్రయత్నించింది..కానీ ఓటర్లచే తిరస్కరించబడింది” అన్నారామె.
గత 2000 సంవత్సరాలుగా మేము కాళీమాతను ఆరాధిస్తున్నామని..మాకాళీమాతను ఎలా పూజించాలో బీజేపీ ఏమీ మాకు నేర్పించనవసరం లేదు కాళీని ఎలా పూజించాలో భక్తులకు బాగా తెలుసు.. అని అన్నారు. బీజేపీ తన ఎజెండాను, అభిప్రాయాలను బలవంతంగా ఇతరులపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది అంటూ విమర్శలు సంధించారు. ఇటువంటి చర్యల్ని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని..ప్రతిఘటించి దేశం కోసం ఒక్కసారి మాట్లాడాలని మహువా సూచించారు.
Also read : Kaali poster dispute: కాళీమాత పోస్టర్‌పై టీఎంసీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. వారిపై యూపీలో కేసు నమోదు
కాగా ఓ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌ను డైరక్టర్ లీనా మణిమేకలై పోస్టర్‌ను విడుదల చేయగా.. పెద్ద దుమారాన్ని రేపింది. అందులో కాళీమాత వేషదారణలో ఉన్న నటి ఒక చేత్తో త్రిశూలం పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ తాగుతున్నట్టు ఉండడంతో వివాదంగా మారింది. పలు విమర్శలు వచ్చాయి. ఒక దేవతను అలా చూపించడం ఏంటి అంటూ ఆగ్రహాలు వ్యక్తం అయ్యాయి. దానిపై స్పందించిన ఎంపీ మహువా మొయిత్రా తన వ్యాఖ్యలతో ఆ హీట్‌ను మరింత పెంచారు. తనకు సంబంధించినంత కాళీకాదేవి మాంసాహారం, మద్యం స్వీకరించే దేవతేనని అన్నారు. దాంతో మహువాపై కూడా హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈక్రమంలో ఆమె కూడా తనదైన శైలిలో మరోసారి బీజేపీపై విమర్శలు సంధించారు.