WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన హర్షవర్థన్

34మంది సభ్యుల ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఇవాళ(మే-22,2020) బాధ్యతలు స్వీకరించారు. భారత కోవిడ్-19 యుద్ధంలో ముందువరుసలో ఉన్న హర్షవర్థన్…ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా ఉన్న జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో బాధ్యతలు స్వీకరించారు.

WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హర్షవర్ధన్ మాట్లాడుతూ….కరోనా వైరస్ ప్రపంచ సంక్షోభంగా మారిన సమయంలో నేను ఈ బాధ్యతలు చేపట్టాను. రాబోయే రెండు దశాబ్దాల్లో అనేకరకాలైన ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురుతాయని మనమందరం అర్థం చేసుకున్నాం. ఈ సవాళ్లన్నీ భాగస్వామ్య ప్రతిస్పందనను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు యొక్క ప్రధాన విధులు.. హెల్త్ అసెంబ్లీ యొక్క నిర్ణయాలు మరియు విధానాలను ప్రభావితం చేయడం, సలహా ఇవ్వడం మరియు సాధారణంగా దాని పనిని సులభతరం చేయడం. గత ఏడాది,WHOకి చెందిన సౌత్-ఈస్ట్ ఆసియా గ్రూప్ మే నెల నుంచి మూడేళ్ల కాలానికి భారతదేశ నామినీని ఎగ్జిక్యూటివ్ బోర్డులోకి ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డులో భారత నామినీని నియమించే ప్రతిపాదనపై 194 దేశాల ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మంగళవారం సంతకం చేసింది. 

ఎగ్జిక్యూటివ్ బోర్డు మూడేళ్లకు ఒకసారి ఎన్నికవుతోంది. బోర్డు చైర్మన్ పదవి కూడా మూడేళ్లు పాటు ఉంటుంది. అయితే.. చైర్మన్ పదవి పూర్తికాలం అసైన్మెంట్ కాదు. కేవలం బోర్డు సమావేశాల్లో చైర్మన్ అందుబాటులో ఉంటే సరిపోతుంది. బోర్డు సంవత్సరంలో రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. జనవరిలో, మేలో ఈ సమావేశాలు జరుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను అమలుచేసే బాధ్యత బోర్డు సభ్యులపై ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన హర్షవర్ధన్‌కు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ గాబ్రెయాసిస్‌ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పాత్రలోకి ఆయను ఆహ్వానిస్తున్నామన్నారు.  

Read: ఒడిషా చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

ట్రెండింగ్ వార్తలు