Delhi Rain : ఢిల్లీలో గాలి,వాన బీభత్సం.. ఏపీ,తెలంగాణ భవన్‌లు పాక్షికంగా ధ్వంసం

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జాంతో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

delhi rain

Delhi Rain :  దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి జన జీవనం స్తంభించింది. ట్రాఫిక్ జామ్ తో పలు చోట్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణం అనుకూలించకపోవటంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ  విమానాశ్రయంలో పలు విమానాల ల్యాండింగ్ కష్టమయ్యింది. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకపోయే సరికి కొద్ది సేపు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. నగరంలో పార్కింగ్ చేసిన వాహనాలపై చెట్లు విరిగి పడ్డాయి. గాలుల వేగానికి నగరంలోని పలు కార్యాలయాల అద్దాలు పగిలిపోయాయి. కొన్ని చోట్ల కరెంట్ స్తంబాలు వంగిపోయాయి.

ఏపీ, తెలంగాణ భవన్ లలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. భవనంలోని అద్దాలు పగిలిపోయాయి. భవనాలలో పాక్షికంగా  దెబ్బతిన్న ప్రదేశాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ పరిశీలించారు. ఢిల్లీలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి పరిస్ధితి చూడలేదని వారు చెప్పారు. దెబ్బతిన్న భవనాలకు త్వరలోనే మరమ్మత్తులు చేయిస్తామని… పాత భవనాలను ఖాళీ చేయిస్తామని వారు తెలిపారు.