Mumbai : అత్యవసరం అయితేనే బయటకు రండి, ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

ముంబైలో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలపై సీఎం ఉద్ధవ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు....ఉద్ధవ్. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఈ ఉదయం నుంచి భారీ వర్షంతో తడిసిముద్దయింది.

Heavy Rainfall Mumbai : ముంబైలో భారీ వర్షాలు పడుతుండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలపై సీఎం ఉద్ధవ్ సమీక్ష నిర్వహించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దన్నారు….ఉద్ధవ్. నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి ఈ ఉదయం నుంచి భారీ వర్షంతో తడిసిముద్దయింది. రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే కుండపోత కురుస్తోంది.

వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో లోకల్‌ రైళ్లను నిలిపివేశారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఈ ఉదయం 6 గంటల వరకు ముంబయిలో కొలాబాలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్లు, శాంతాక్రూజ్‌లో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు ముంబయి, శివారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది.

థానే, రాయ్‌గఢ్‌, పుణె, బీడ్‌, పాల్ఘర్, నాసిక్‌ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ 10న నైరుతి రుతుపవనాలు ముంబయిని తాకుతాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందే వచ్చినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు