Tamil Nadu : ప్రాణం తీసిన కోడి వివాదం

పందెంలో కోడి ఓడిపోయిందని దానిని అమ్మిన యజమానిపై గొడవపడ్డాడు ఓ వ్యక్తి.. గొడవ పెద్దది కావడంతో ఒకరి ప్రాణం తీసింది.

Tamil Nadu : పందెం కోళ్ల విషయంలో తలెత్తిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి జిల్లా తంజావూరుకు చెందిన అహ్మద్, అతని కుమారుడు ఇమ్రాన్ (22) కోడి పందాలు ఆడుతుంటారు. కృష్ణగిరి నేతాజీ నగర్ రోడ్డుకు చెందిన మార్గో (56) వద్ద వీరు కోళ్లు కొనుగోలు చేశారు. అయితే అవి పందెంలో సరిగా ఆడలేదు.

ఈ క్రమంలోనే పాతపేట థియేటర్ వద్ద కనిపించిన మార్గోతో ఇమ్రాన్ గొడవ పడ్డాడు. నీ దగ్గర తీసుకున్న కోళ్లు సరిగా ఆడలేదని, ఆ పందెంలో ఓడిపోయామని అతడిని విమర్శించాడు. దీంతో మార్గో, అతడి కుమారుడు ఆరన్.. ఇమ్రాన్ పై కత్తితో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇమ్రాన్ అన్న సలావుద్దీన్‌ ను కూడా కత్తితో పొడిచారు.

ఈ దాడిలో ఇమ్రాన్ అక్కడిక్కడే మృతి చెందగా.. సలావుద్దీన్ గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు