Henna Blouse : నయా ట్రెండ్, మెహందీ బ్లౌజ్..వీడియో వైరల్

మెహందీ బ్లౌజ్ వేసుకున్న మహిళకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

Mehandi

Henna Blouse: మెహందీ ఇష్టం లేని వారు ఉంటారా ? చేతికి ఎర్రగా పండే..మెహిందీని మహిళలు ఎంతో ఇష్టంగా పెట్టుకుంటుంటారు. పెళ్లిళ్లు, శుభాకార్యాలయాలు జరిగే సమయంలో…మెహందీ పెట్టుకుంటుంటారు. మెహిందీని తెలుగులో గోరింటాకు..మైదాకు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా మంది ఎక్స్ పర్ట్ కూడా ఉంటారు.

Read More : Tirumala : తిరుమలకు వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు

వెరైటీ వెరైటీ డిజైన్లు వేయడంలో వీరు దిట్ట. కార్యక్రమాలు..వేడుకల సీజన్ లో వీరికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. కొత్త కొత్త డిజైన్లు వేస్తూ…పేరు సంపాదించుకుంటుంటారు. మెహందీ అనగానే..చేతులు, కాళ్లు..కొన్నిసార్లు తెల్లజుట్టు ఉంటే…వేసుకోవడం వంటివి చూస్తుంటాం. కొత్త ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు మహిళలు.

Read More :woman constable gender change : మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడికి హోంశాఖ అనుమతి..సర్జరీ తరువాత ఉద్యోగం చేయొచ్చు..

మెహందీ బ్లౌజ్ వేసుకున్న మహిళకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. థానోస్ జాట్ ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు. మెహందీ బ్లౌజ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? సాధారణంగా ధరించే బ్లౌజ్ కు బదులుగా…శరీరంపై హెన్నా డిజైన్ వేసుకున్నారంట. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఉంది..మెహందీని ఇలా కూడా వాడేస్తున్నారా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు.