Tirumala : తిరుమలకు వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు

తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు.

Tirumala : తిరుమలకు వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు

Tirumala

Tirumala : తిరుపతి, తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఘాట్ రోడ్డును చెన్నై ఐఐటీ నిపుణులు పరిశీలించారని ఆయన తెలిపారు. గురువారం ఢిల్లీ ఐఐటీ నిపుణులు వస్తారని, ఘాట్ రోడ్డును పరిశీలిస్తారని వెల్లడించారు. ఐఐటీ నిపుణుల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జవహర్ రెడ్డి చెప్పారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు రెండో ఘాట్ రోడ్ లోని 13వ కిమీ, 15వ కిలోమీటర్ల దగ్గర కొండ చరియలు విరిగిపడి రక్షణ గోడలు ధ్వంసమయ్యాయని ఈవో తెలిపారు.

Thippatheega : ఆరోగ్య సమస్యలకు తిప్పతీగ

ఘాట్ రోడ్ లో మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయని, సాయంత్రం లోపు మట్టి బండరాళ్లు, మట్టి పనులు పూర్తవుతాయని వివరించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు తిరుపతి నుండి తిరుమలకు 2వేల 300 వాహనాలు.. తిరుమల నుండి తిరుపతికి 2 వేల వాహనాలు ప్రయాణించాయని తెలిపారు. ఘాట్ రోడ్ లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్, ఫారెస్ట్, ఆరోగ్య విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి సూచించారు.

దర్శనం వాయిదా వేసుకుంటే మంచిది..
తిరుపతి, తిరుమలలో కురస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు దగ్గర రహదారి భారీగా కోతకు గురైంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ధ్వంసమైన ఘాట్‌ రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు డౌన్‌ ఘాట్‌ రోడ్డులోనే వాహనాల రాకపోకలను అనుమతిస్తామని ఆయన తెలిపారు.

కాగా, ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్‌ చేసుకుని వాహనాల్లో వచ్చే శ్రీవారి భక్తులు తమ ప్రయాణాలను వారం రోజులు వాయిదా వేసుకుంటే మంచిదని టీటీడీ ఛైర్మన్‌ సూచించారు. వారికి వచ్చే ఆరు నెలల్లోగా దర్శన తేదీ మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఇక నడకదారి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదని సుబ్బారెడ్డి తెలిపారు.

Pumpkin Seeds : శరీరానికి పోషకాలనిచ్చే గుమ్మడిగింజలు

ఐఐటీ నిపుణులను పిలిపించి ఘాట్ రోడ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం జాగ్రత్త వహిస్తామన్నారు వైవీ సుబ్బారెడ్డి. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 15 రోజుల పాటు ఎడతెరపిలేని వర్షం కురవడంతో ఘాట్ రోడ్లు ధ్వంసమవుతున్నాయన్నారు.