Lavanya Tripathi : మొదటి సారి బేబీ బంప్ ఫొటోతో మెగా కోడలు.. పండగ పూట స్పెషల్ ఫొటో..
ఇటీవల మే లో లావణ్య ప్రగ్నెన్సీ విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత లావణ్య ఎక్కువగా కనపడలేదు.(Lavanya Tripathi)

Lavanya Tripathi
Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ ఆరేళ్లు సైలెంట్ గా ప్రేమించుకొని 2023లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ప్రస్తుతం సినిమాలు చేస్తూనే హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత రెగ్యులర్ గా ట్రిప్స్ కి వెళ్తూ ఆ ట్రిప్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.(Lavanya Tripathi)
ఇటీవల మే లో లావణ్య ప్రగ్నెన్సీ విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత లావణ్య ఎక్కువగా కనపడలేదు. మొదటిసారి లావణ్య బేబీ బంప్ ఫొటోతో కనిపించింది. నేడు వినాయకచవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి పూజ చేసి వరుణ్, లావణ్య కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫొటోలో లావణ్య బేబీ బంప్ తో ఉంది. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారు.
Also Read : Sundarakanda : ‘సుందరకాండ’ మూవీ రివ్యూ.. బాబోయ్ ట్విస్ట్, లవ్ స్టోరీ మాములుగా లేదుగా..