Laptop Heating : మీ ల్యాప్‌టాప్ వేడెక్కుతుందా? 5 కారణాలివే.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో క్షణాల్లో ఫిక్స్ చేయొచ్చు..!

Laptop Heating : మీకు ల్యాప్ టాప్ ఉందా? వాడినా కొద్దిసేపటికే హీట్ ఎక్కువుతుందా? ఈ సింపుల్ ట్రిక్స్ ట్రై చేశారంటే వేగంగా ఫిక్స్ చేయొచ్చు.

Laptop Heating : మీ ల్యాప్‌టాప్ వేడెక్కుతుందా? 5 కారణాలివే.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో క్షణాల్లో ఫిక్స్ చేయొచ్చు..!

Laptop Heating

Updated On : August 27, 2025 / 2:05 PM IST

Laptop Heating : మీ ల్యాప్‌టాప్ వెంటనే వేడుక్కుతోందా? దీనికి అనేక కారణాలు ఉంటాయి. అదేపనిగా ల్యాప్‌టాప్ హీట్ కావడం వల్ల తొందరగా పాడైపోతుంది. అంతేకాదు.. ల్యాప్ టాప్ (Laptop Heating) పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. హార్డ్‌వేర్ కూడా దెబ్బతింటుంది.

మీ డివైజ్ లైఫ్ టైమ్ కూడా కూడా తగ్గుతుంది. మీ ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ అవ్వడానికి గల 5 ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ల్యాప్‌టాప్ కూల్ ఉంచేందుకు మీరు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

1. డస్ట్, ఎయిర్ ఫిల్టర్ బ్లాకింగ్ :
ల్యాప్‌టాప్ లోపల దుమ్ము పేరుకుపోవడం వల్ల ఎయిర్ ఫ్లో అడ్డుకుంటాయి. వేడి గాలి బయటకు వెళ్లకుండా అలానే ఉండటం వల్ల హీట్ పెరిగి సమస్యలు ఎదురవుతాయి. బ్లాక్ అయిన ఫిల్టర్స్ కూలింగ్ సిస్టమ్ రన్ కాకుండా అడ్డుకుంటాయి. దాంతో మీ ల్యాప్ టాప్ వెంటనే వేడెక్కుతుంది.

ఇలా ఫిక్స్ చేయండి
కంప్రెస్డ్ ఎయిర్ తో క్రమం తప్పకుండా క్లీన్ చేయడం లేదా సర్వీస్ చెక్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

2. ఓవర్‌లోడెడ్ CPU, GPU :
భారీ సాఫ్ట్‌వేర్, గేమ్‌లు లేదా మల్టీ యాప్‌లను ఒకేసారి రన్ చేయడం వల్ల మీ ల్యాప్‌టాప్ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది, ముఖ్యంగా ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్‌పై ప్రభావం పడి మీ సిస్టమ్‌ను త్వరగా హీట్ అయ్యేలా చేస్తుంది.

ఎలా పరిష్కరించాలి? :
అనవసరమైన అప్లికేషన్‌లను బ్యాక్ గ్రౌండ్ లో రన్ కాకుండా క్లోజ్ చేయాలి. పర్ఫార్మెన్స్ మోడ్‌ ద్వారా మెషీన్‌ను పాడవ్వకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు.

Read Also : Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోందోచ్.. మొత్తం 4 ఐఫోన్లు.. లాంచ్ డేట్ లీక్ అయింది ఇదిగో.. ఫుల్ డిటెయిల్స్

3. పాత, రాంగ్ థర్మల్ పేస్ట్ :
థర్మల్ పేస్ట్ CPU/GPU నుంచి కూలింగ్ ఫ్యాన్‌కు హీట్ ట్రాన్స్ ఫర్ చేస్తుంది. కాలక్రమేణా, ఎండిపోయి సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో అధిక వేడికి కారణమవుతుంది.

ఎలా పరిష్కరించాలి? :
థర్మల్ పేస్ట్‌ను తిరిగి పూతలా పూయాలి. అప్పుడు హీట్ మేనేజ్ మెంట్ వేగంగా మెరుగుపడుతుంది.

4. వీక్ కూలింగ్ ఫ్యాన్లు :
మీ ల్యాప్‌టాప్ ఫ్యాన్ పాడైపోయినా లేదా తక్కువ వేగంతో పనిచేసినా మీ సిస్టమ్‌ను సరిగ్గా కూలింగ్ కాదు. కొద్దిసేపు ల్యాప్‌టాప్ వాడినా కూడా వెంటనే వేడెక్కుతుంది.

ఎలా ఫిక్స్ చేయాలంటే? :
ఫాల్టీ ఫ్యాన్ పక్కన పడేసి కొత్తగా ఫ్యాన్లతో రిప్లేస్ చేయడమే బెస్ట్. అసలు ఆలస్యం చేయవద్దు.

5. మొత్తని ఉపరితలంపై ల్యాప్‌టాప్‌ వాడకం :
మీ ల్యాప్‌టాప్‌ను మంచం, దిండు లేదా దుప్పటిపై ఉంచడం వల్ల ల్యాప్‌టాప్ అడుగున ఉంచిన ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి ఎయిర్ ఫ్లో అడ్డుపడతాయి. సరైన ఎయిర్ ఫ్లో లేకుంటే డివైజ్ త్వరగా వేడెక్కుతుంది.

ఎలా ఫిక్స్ చేయాలి? :
హీట్ బయటకు పోయేందుకు ఎల్లప్పుడూ గట్టి ఉపరితలం లేదా ల్యాప్‌టాప్ కూలింగ్ ప్యాడ్‌ను వినియోగించండి.