Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోందోచ్.. మొత్తం 4 ఐఫోన్లు.. లాంచ్ డేట్ లీక్ అయింది ఇదిగో.. ఫుల్ డిటెయిల్స్
Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. అధికారిక లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసింది. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర అంచనాలివే

Apple iPhone 17 Series
Apple iPhone 17 Series : టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తేదీ లీక్ అయింది. నివేదికల ప్రకారం.. ఈ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరగనుంది. ఈ సందర్భంగా (Apple iPhone 17 Series) ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ లతో పాటు కొత్త ఆపిల్ వాచ్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
వాస్తవానికి, కంపెనీ ఆపిల్ టీవీ యాప్‌లో ఈవెంట్ ఇన్విటేషన్ (Awe-Dropping) బ్యానర్ పోస్ట్ చేసింది. కొత్త ఐఫోన్ సిరీస్ లాంచ్ తేదీ రివీల్ అయింది. అయితే, వెంటనే కంపెనీ ఆ పోస్ట్‌ను తొలగించింది. ఆపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఏ తేదీన లాంచ్ చేయనుందో తెలిసిపోయింది.
రాబోయే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో ప్రతిది కొత్త కలర్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లు, డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లను సూచిస్తున్నాయి. డిజైన్ రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే లీక్ కాగా, ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తేదీ, ధర రేంజ్, స్పెక్స్, కలర్ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తేదీ :
సెప్టెంబర్ 9న ‘అవే డ్రాపింగ్’ అనే ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఆపిల్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి కొత్త ఐఫోన్లు అమ్మకానికి రానున్నాయి. సేల్, ప్రీ-ఆర్డర్ వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.
Read Also : Motorola Edge 50 Pro : అతి తక్కువ ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?
ఐఫోన్ 17 ప్రో మాక్స్, 17 ప్రో, 17 స్పెక్స్ :
ఐఫోన్ 17 ఐఫోన్ 16 మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో డ్యూయల్ కెమెరా- 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంటాయి. ఇందులో బిగ్ స్క్రీన్, 120Hz ప్రోమోషన్ టెక్ ఉండవచ్చు. ఆపిల్ A19 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కెమెరా కంట్రోల్స్, సపోర్టు అందించవచ్చు.
మరోవైపు, ఐఫోన్ 17 ఎయిర్ అనేది ఐఫోన్ 17 ప్లస్ స్థానంలో కొత్త స్లిమ్ డిజైన్ (5.5mm మందం) పిక్సెల్ లాంటి కెమెరా ఐలాండ్‌ను తీసుకురానుందని అంచనా. శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌తో పోలిస్తే.. ఈ ఐఫోన్ల బరువు చాలా తక్కువగా ఉండవచ్చు. 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉండవచ్చు. A19 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ అందించవచ్చు.
ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అతిపెద్ద డిజైన్ మార్పుతో రానుందని చెబుతున్నారు. ట్రిపుల్ 48MP కెమెరా సెటప్‌తో కొత్త రెక్టాంగులర్ కెమెరా బార్ ఉండొచ్చు. ఫ్లాష్, LiDAR రైట్ సైడ్ మార్చవచ్చు. ఈ రెండు ఫోన్ల ఆపిల్ లోగో కొద్దిగా పక్కకు జరిగే అవకాశం ఉంది. 12GB వరకు ర్యామ్, A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందవచ్చు. అయితే, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ డిస్‌ప్లే సైజులో తేడాలు ఉండవచ్చు.
ఐఫోన్ 17 సిరీస్ భారత్ ధర, కలర్ ఆప్షన్లు (అంచనా) :
నివేదికల ప్రకారం.. ఐఫోన్ 17 ధర రూ.89,900, ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ.99,900 ఉండొచ్చు. ఐఫోన్ 17 ప్రో ధర రూ.1,24,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,64,900 ఉండొచ్చు. ఐఫోన్ 17 స్టీల్ గ్రే, గ్రీన్, పర్పుల్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ బ్లాక్, వైట్, గ్రే, డార్క్ బ్లూ, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో రానున్నాయి.