పండుగపూట విషాదం.. వైష్ణోదేవి ఆలయ ఘటనలో 32 మంది మృతి..

కొండపైకి వెళ్లే రెండు రోడ్లలో ఒక రోడ్డు మీద భారీగా ఈ కొండచరియలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పండుగపూట విషాదం.. వైష్ణోదేవి ఆలయ ఘటనలో 32 మంది మృతి..

Vaishno Devi temple tragedy

Updated On : August 27, 2025 / 2:13 PM IST

Vaishno Devi temple: వినాయకచవితి వేళ విషాదం చోటుచేసుకుంది. వైష్ణో దేవి ఆలయ కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 32కి పెరిగింది. భారీ వర్షాలతో వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

బండరాళ్లను తొలగించే పనులు చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో ఆలయానికి భక్తులు రావొద్దని తెలిపి ఆలయ అధికారులు దర్శనాలను నిలిపివేశారు.

కొండపైకి వెళ్లే రెండు రోడ్లలో ఒక రోడ్డు మీద భారీగా ఈ కొండచరియలు పడ్డాయి. వాటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. (Vaishno Devi temple)

Also Read: ట్రంప్‌ని లైట్ తీసుకున్న మోదీ..? నాలుగు సార్లు కాల్ చేస్తే కూడా..

జమ్మూకశ్మీర్ లో భారీ వర్షాలు

మరోవైపు జమ్మూకశ్మీర్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వరదలు వస్తున్నాయి. వరద ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 24 గంటలుగా నాన్ స్టాప్ గా వాన పడుతూ ఉండడంతో జనజీవనం అస్తవ్యస్థం అయింది. చీనాబ్, తావి, ఉజ్, రావి, బసంతేర్ లాంటి ప్రాంతాల్లో వాగులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

దెబ్బతిన్న కమ్యూనికేషన్ వ్యవస్థ

జమ్మూకశ్మీర్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. తీవ్రమైన విద్యుత్ అంతరాయాలు నెలకొంటున్నాయి. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. ఓ వైపు పవర్ కట్, మరోవైపు కనీసం కాల్ చేసి సాయం అడుగుదామన్నా సెల్ ఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ లో కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతిందని సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు.