హైజాక్ వార్నింగ్ : చెన్నై ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్

విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై

  • Publish Date - March 4, 2019 / 03:29 AM IST

విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై

విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై దాడులకు  తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు.. కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచారు.

దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ శనివారం(మార్చి 3) ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను పెంచాలని ఆదేశించింది. దీంతో చెన్నై విమానాశ్రయానికి  రెడ్‌ అలర్ట్‌ భద్రత కల్పించారు. తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన  వచ్చే వరకు విజిటర్స్‌ను అనుమతించకుండా నిషేధం విధించారు. చెన్నైతో పాటు హైదరాబాద్, కొచ్చిన్, కోయంబత్తూర్, విజయవాడ, బెంగళూరు తదితర దక్షిణాది రాష్ట్రాల ఎయిర్ పోర్టుల్లోనూ  సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి తర్వాత భారత వాయుసేన దళాలు పాక్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అనేకమంది టెర్రిరిస్టులు మృతి చెందారు. దీంతో తీవ్రవాదులు భారత్‌లో ప్రతీకారదాడులు జరపొచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి.