Caste Survey: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద ఊరట.. కులగణనకు లైన్ క్లియర్ చేసిన పాట్నా హైకోర్టు

బీహార్‭లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్‌లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది.

Patna HC: బిహార్‭లోని నితీశ్ కుమార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టు పెద్ద ఊరట కల్పించింది. కురగణనకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో కులగణన చేపట్టేందుకు బిహార్ ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. అయితే గతంలో ఇదే కోర్టు కులగణను నిషేధిస్తూ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టింది నితీశ్ కుమార్ ప్రభుత్వం. అయితే ఇది కేంద్రం పరిధిలోకి వస్తుందని, రాష్ట్రం ఈ పని ఎలా చేస్తుందని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలైంది.

TS High Court : హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 30 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు.. వీటిలో 25కి పైగా అధికార పార్టీ ఎంఎల్ఏలవే

పాట్నా హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు మే 4న తాత్కాలిక స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాలు చేసింది. ఈ కేసును తిరిగి పాట్నా హైకోర్టుకే తిరిగి పంపింది దేశ అత్యున్నత ధర్మాసనం. దీనిపై హైకోర్టులో ఐదు రోజుల పాటు విచారణ కొనసాగింది. అనంతరం జులై 7న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టింది. పాట్నా హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరిస్తూ కుల గణనపై నిషేధాన్ని తొలగిస్తున్నట్లు తీర్పు చెప్పింది.

Assam: భజరంగ్ దళ్ శిక్షణ శిబిరంలో తుపాకుల కలకలం.. కేసు నమోదు చేసిన పోలీసులు

బీహార్‭లో ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన ప్రతిపాదనను శాసనసభ 18 ఫిబ్రవరి 2019న శాసన మండలి 27 ఫిబ్రవరి 2020న ఆమోదించాయి. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్‌లో కులగణన జనవరి 2023లో ప్రారంభమైంది. ఇది రెండు దశల్లో జరగాల్సి ఉంది. 1951 నుండి ఎస్సీ, ఎస్టీల కులాల డేటా సేకరిస్తున్నారు. కానీ ఓబీసీ సహా ఇతర కులాల డేటా అందుబాటులో లేదని బీహార్ ప్రభుత్వం జనాభా గణన గురించి చెబుతోంది. 1990లో కేంద్రంలోని అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల రెండవ కమిషన్ సిఫార్సును అమలు చేసింది. 1931 జనాభా లెక్కల ఆధారంగా, ఓబీసీలు దేశ జనాభాలో 52 శాతం ఉన్నట్లు అంచనా వేశారు.

ట్రెండింగ్ వార్తలు