TS High Court : హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 30 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు.. వీటిలో 25కి పైగా అధికార పార్టీ ఎంఎల్ఏలవే

ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. వనమాపై కోర్టు అనర్హత వేటు వేసింది.

TS High Court : హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 30 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు.. వీటిలో 25కి పైగా అధికార పార్టీ ఎంఎల్ఏలవే

High Court Election Petitions

Telangana High Court : తెలంగాణలో 28 మంది ఎంఎల్ఏల ఎలక్షన్ పిటిషన్లు 10టీవీ చేతికి చిక్కాయి. హైకోర్టులో మొత్తం 25 మంది ఎంఎల్ఏలపై ఎలక్షన్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. 2018లో ఎన్నికల సందర్భంగా పిటిషన్ లు దాఖలయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్ల తీర్పుపై నేతల్లో అలజడి మొదలైంది. కొత్తగూడెం ఎంఎల్ఏ ఎన్నికపై తీర్పు నేపథ్యంలో ఎలక్షన్ పిటిషన్లకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రస్తుతం హైకోర్టులో 30కి పైగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. అందులో 25కి పైగా పిటిషన్లు అధికార పార్టీకి సంబంధించిన ఎంఎల్ఏల పైనే ఉండటం శోచనీయం. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్, మర్రి జనార్ధన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై ఎలక్షన్ పిటిషన్ లు దాఖలు అయ్యాయి.

TSRTC : హైదరాబాద్ సిటీ బస్సుల్లో డే పాస్ ధరలు పెంపు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైన మరుసటి రోజే

ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికపై జలగం వెంకట్రావు పిటిషన్ వేశారు. వనమాపై కోర్టు అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్యే పదవికి అనర్హుడని కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వనమా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

తాజాగా శ్రీనివాస్ గౌడ్ పై ఎలక్షన్ పిటిషన్ లో ట్రైల్ ప్రారంభం అయింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ అఫిడవిట్ ట్యాoపర్ చేశారని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హైకోర్టులో మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు మంత్రి కొప్పుల ఈశ్వర్ పై కాంగ్రెస్ నేత అడ్లురి లక్ష్మణ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు.

High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం

ఇప్పటికే కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ముందు కొప్పుల, అడ్లురి వాంగ్మూలం వినిపించారు. బుధవారం కొప్పుల ఈశ్వర్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ పై విచారణ జరుగనుంది. మరో మంత్రి గంగుల కమలాకర్ పై బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.

గంగుల కమలాకర్ పై దాఖలైన ఎలక్షన్ పిటిషన్ లోనూ హైకోర్టు రిటైర్డ్ జడ్జి శైలజతో కమిషన్ ను నియమించింది. ఆగస్టు 12 నుండి 17తేదీ వరకు క్రాస్ ఎగ్జామినేశన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రానున్న రోజుల్లో మరికొందరి నేతల ఎలక్షన్ పిటిషన్ లు విచారణకు రానున్నాయి.