Thousands of Punjabi farmers on the border : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా..పంజాబ్ రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. 2020, నవంబర్ 26వ తేదీ గురువారం మార్చ్ టు ఢిల్లీకి పిలుపునిచ్చారు. భారీ సంఖ్యలో రైతులు పాదయాత్రగా తరలివస్తున్నారు. దేశ రాజధానిని కలిపే ఐదు మార్గాల ద్వారా వారు ఢిల్లీకి బయలుదేరారు.
దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు. దేశ రాజధానిలో ర్యాలీకి Aam Aadmi Party (AAP) ప్రభుత్వం అనుమతించలేదు. రాజస్థాన్, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి పాదయాత్ర వెళ్లాలని యోచిస్తున్నారు.
https://10tv.in/mamata-banerjee-dares-bjp-to-arrest-her-says-will-ensure-tmc-victory-in-polls-from-jail-itself/
గురువారం, శుక్రవారం రోజుల్లో పంజాబ్ సరిహద్దును క్లోజ్ చేయాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఆదేశించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఫరిదాబాద్, గురుగ్రామ్ ల సరిహద్దులో భధ్రతను కఠినతరం చేశారు.
రైతులను ఆపడానికి బారికేడ్లు, భారీ సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. గురు, శుక్రవారాల్లో పంజాబ్, ఇతర ప్రాంతాలకు బస్సు సేవలను రద్దు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. రెండు లక్షల మంది రైతులు హర్యానాలోకి ప్రవేశిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (Ekta-Ugrahan) వెల్లడించింది.