రూల్స్‌ను లైట్ తీసుకుంటే మనీ టైట్ అయిపోతుంది. సెప్టెంబర్ 1నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. కొద్ది రోజుల ముందే భారీగా పెరిగిన ఫైన్‌లతో పాటు ఫాలో అవ్వాల్సిందేనంటూ రూల్స్‌ను గుర్తుకు తెస్తున్నారు. ఫైన్ అమౌంట్‌ను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. మోటారు వాహన నిబంధనల సవరణ చట్టానికి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమోదం లభించింది. వీటితో రూల్స్ కఠినంగా మారాయి.
వీటి తర్వాత డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రహదారి భద్రతా నిధి, ప్రైవేటు క్యాబ్ వ్యవస్థల స్థిరీకరణ, రవాణా వ్యవస్థలో సంస్కరణలు తదితర అంశాలను దశలవారీగా అమలులోకి తీసుకురానుంది.
లోడ్ పెరిగిందా ఇక అంతే:
ఓవర్ లోడ్‌తో నడిచే రవాణా వాహనాలు, ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్లను ఎక్కించుకుని నడిపే వాహనాలకు ఎక్కువ మొత్తంలోనే ఫైన్‌లు పడనున్నాయి. ప్రస్తుతం ఫైన్ కింద రూ.2 వేలు ఉండగా, ప్రతి అదనపు టన్నుకు రూ.వెయ్యి అదనంగా వసూలు చేసేవారు. ఆ మొత్తాన్ని పది రెట్లు పెంచి రూ.20 వేలకు పెంచారు. అదనపు బరువు ఫైన్‌ను రెట్టింపు చేస్తూ టన్నుకు రూ.2 వేలుగా నిర్ణయించారు.
కక్కుర్తిపడి ప్యాసింజర్లను ఇరికించి ప్రయాణిస్తే.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి వరకూ ఫైన్ వసూలు చేస్తారు. టూ వీలర్‌పై అధిక బరువును వినియోగిస్తే రూ.2 వేల అపరాధ రుసుముతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తారు. ఈ ఫైన్ గతంలో రూ.100గా ఉండేది.
అంశం | ప్రస్తుతం రూపాయల్లో | కొత్త ఫైన్ రూపాయల్లో |
---|---|---|
హెల్మెట్ వాడకపోతే | 100 | 1000, 3నెలలు అనర్హత |
మద్యం మత్తులో వాహనం నడిపితే | 2వేలు | 10వేలు |
సీటు బెల్ట్ పెట్టుకోకపోతే | 100 | 1000 |
డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడిపితే | 500 | 5వేలు |
అనర్హత వేటేసినా వాహనం నడిపితే | 500 | 10వేలు |
అధిక వేగం | 400 | 1000-2000 |
ప్రమాదకరంగా వాహనం నడిపితే | 1000 | 5వేలు వరకూ |
అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే | — | 10వేల వరకూ |
వాహనానికి భీమా లేకపోతే | 1000 | 2వేలు |
పర్మిట్ లేని వాహనానికి | 5వేలు | 10వేలు |