Hindu outfit protests : అక్షయ్ కుమార్ ఓఎంజీ 2 సినిమా విడుదలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ ఆందోళనలు
సినిమా హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 సినిమా విడుదలకు నిరసనగా హిందూ సంస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఆందోళన చేపట్టింది. ఎవరైనా హీరో అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టినా లేదా అతని ముఖానికి నలుపు రంగు పూసినా రూ.10లక్షల బహుమతి ఇస్తామని రాష్ట్రీయ భజరంగ్ దళ్ తెలిపింది....
- saleem sk
- Published On : August 12, 2023 / 06:05 AM IST
Hindu outfit protests
Hindu outfit protests : సినిమా హీరో అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 సినిమా విడుదలకు నిరసనగా హిందూ సంస్థ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఆందోళన చేపట్టింది. ఎవరైనా హీరో అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టినా లేదా అతని ముఖానికి నలుపు రంగు పూసినా రూ.10లక్షల బహుమతి ఇస్తామని రాష్ట్రీయ భజరంగ్ దళ్ తెలిపింది. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యుడు గోవింద్ పరాశర్ ఈ మేర ప్రకటన చేశారు. (Hindu outfit protests) సినిమా విడుదలపై ఆగ్రాలో నిరసనలు చెలరేగాయి.
Pakistan : బలోచిస్థాన్ కెచ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
రాష్ట్రీయ భజరంగ్ దళ్ కార్యకర్తలు శ్రీ టాకీస్ వెలుపల గుమిగూడి సినిమా ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. నిరసనకారులు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. రాష్ట్రీయ భజరంగ్ దళ్ యొక్క బ్రజ్ ప్రాంట్ ఉపాధ్యక్షుడు రౌనక్ ఠాకూర్ నేతృత్వంలో నిరసనకారులు సినిమా హాలు వెలుపల అక్షయ్ చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. (Akshay Kumars film OMG 2) ఘటనాస్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
Srisailam : శ్రీశైలం మల్లన్న హుండీ లెక్కింపు.. 28 రోజులకు రూ.3.43 కోట్ల ఆదాయం
అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 చిత్రం తెరపైకి రాకముందే, వివిధ హిందూ సంస్థలతో అనుబంధం ఉన్న ఆధ్యాత్మిక నాయకురాలు సాధ్వి రితంభర బృందావన్‌లోని తన ఆశ్రమంలో సినిమా గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాల్లో హిందూ దేవతలను అవమానించడం గతంలో కూడా జరిగిందని.. హిందువుల విశ్వాసంతో ఆటలాడితే సహించేది లేదరి పాధ్వి రితంబర హెచ్చరించారు.
బాలీవుడ్ ఇలాగే కొనసాగితే హిందువులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతారని ఆమె చెప్పారు. అక్షయ్ కుమార్ నటించిన ఓఎంజీ 2 శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం కుమార్, పరేష్ రావల్ నటించిన 2012 చిత్రం ఓఎంజీ – ఓహ్ మై గాడ్ కి సీక్వెల్. అక్షయ్ కుమార్ తో పాటు ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కూడా నటించారు.
