Government Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు లక్ష రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు

ఎంపికైన వారికి మెట్రో నగరాల్లో నెలకు లక్ష రూపాయల వరకు శాలరీ ఉంటుంది. Government Jobs

Government Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు లక్ష రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు

Government Jobs - DRDO Recruitment 2023 (Photo : Google)

Government Jobs – DRDO Recruitment 2023 : ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా? దాంతో పాటే భారీ జీతం కూడా కావాలని కోరుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ మీ కోసమే. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంతకీ ఆ ఉద్యోగం ఏంటో తెలుసా.. డీఆర్డీవో(DRDO) లో సైంటిస్ట్-బి జాబ్.

Also Read..NLC Recruitment : నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటీస్ ఖాళీల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

డీఆర్డీవోలో 204 సైంటిస్ట్-బీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. www.drdo.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ లో స్కోరుకు 80శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 20శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మెట్రో నగరాల్లో నెలకు లక్ష రూపాయల వరకు శాలరీ ఉంటుంది.

పోస్టులు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, జీతం వివరాలు..
* పలు విభాగాల్లో సైంటిస్ట్ బి ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
* మొత్తం పోస్టులు 204.
* ఒక్కో విభాగానికి ఒక్కో విధంగా విద్యార్హతలు ఉన్నాయి.
* ఎంపికైన వారు స్థాయి-10 (7వ CPC)లో నెలవారీ పే స్కేల్ పొందుతారు. చేరిన సమయంలో మొత్తం చెల్లింపులు ప్రస్తుత మెట్రో సిటీ రేటు ప్రకారం నెలకు సుమారు లక్ష రూపాయలు అవుతుంది.
* గరిష్ట వయోపరిమితి 35 నుండి 40 సంవత్సరాలు. భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు వారి సంబంధిత రంగాలు/ విభాగాల్లో సంబంధిత సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
* DRDO రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఆసక్తి గల అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ను ఫిలప్ చేసి అదే వెబ్‌సైట్‌ లో సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* కమిటీ నిర్వహించే మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
* DRDO రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీ లేదా అంతకు ముందు సమర్పించాలి.
* అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అదీ ఆన్ లైన్ లో మాత్రమే. ఈ ఫీజు నాన్ రీఫండబుల్.
* SC/ ST/ PWD, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
* కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎంపికైన అభ్యర్థులు రిమోట్/ఫీల్డ్ ఏరియా స్థానాలతో సహా భారతదేశంలో ఎక్కడైనా సేవలందించే బాధ్యతను కలిగి ఉంటారు.
* ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటీరియల్ ఇంజినీరింగ్ పాస్ అయి ఉండాలి.

Also Read..BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

DRDO రిక్రూట్‌మెంట్ 2023.. ఎలా దరఖాస్తు చేయాలి:
* DRDO రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు DRDO అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్ నింపాలి. అదే వెబ్‌సైట్‌కు సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఆన్‌లైన్ లో అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 31.08.2023.
* అభ్యర్థులు అప్లికేషన్ ఫారమ్ ను సమర్పించే చివరి తేదీ లేదా అంతకు ముందు సమర్పించాలి.