NLC Recruitment : నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటీస్ ఖాళీల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

NLC Recruitment : నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటీస్ ఖాళీల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

NLC Recruitment

NLC Recruitment : నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 850 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో ట్రేడ్ అప్పెంటీస్ 369 ఖాళీలు, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 201 ఖాళీలు, నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 105 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

READ ALSO : Right To Sleep : మీ నిద్రకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కేసు పెట్టొచ్చు అని తెలుసా..?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన వారు అర్హులు. కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్‌లను డిగ్రీ / డిప్లొమా అకడమిక్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు సంబంధించి హెచ్‌ఎస్‌సీ, XII పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : Nampally Court : మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని.. ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 07.08.2023 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 16 దరఖాస్తుకు ఆఖరు గడువు. హార్డు కాపీలను ఆగస్టు 23 వరకు సంబంధిత చిరునామాకి పంపించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlcindia.in/ పరిశీలించగలరు.