BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 - రూ.1,40,000. వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులకు రూ.30,000 - రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు.

BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Job Notifications

BDL Recruitment : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో వివిధ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బీడీఎల్‌ కార్యాలయాలు, యూనిట్లలో మొత్తం 45 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం (రంగా రెడ్డి జిల్లా), కార్పొరేట్ ఆఫీస్ (గచ్చిబౌలి), కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్‌ (ఏపీ), అమరావతి (మహారాష్ట్ర), లియాసిన్ ఆఫీస్ (న్యూ ఢిల్లీ) కార్యాలయాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Jayaprada : నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష ..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి కొన్ని పోస్టులకు 28 సంవత్సరాలు, మరికొన్నింటికి ఖాళీలకు 27 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

READ ALSO : KA Paul : పవన్, చిరంజీవిపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తా.. పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను : కేఏ.పాల్ వార్నింగ్

కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.40,000 – రూ.1,40,000. వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులకు రూ.30,000 – రూ.1,20,000. నెలకు వేతనంగా చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

READ ALSO : North facing sleep : ఉత్తరం వైపు పడుకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?

అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది 20.09.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bdl-india.in/ పరిశీలించగలరు.