KA Paul : పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్స్.. వాళ్ల మాటలు నమ్మకండి : కేఏ పాల్

చిటికేస్తే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తా అనడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కి సిగ్గు, బుద్ధి లేదా మాయావతి కాళ్ళు పట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

KA Paul : పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్స్.. వాళ్ల మాటలు నమ్మకండి : కేఏ పాల్

KA Paul (5)

Updated On : August 11, 2023 / 3:29 PM IST

KA Paul Angry Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవిపై (Chiranjeevi) ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. పవన్, చిరంజీవిపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తానని తెలిపారు. ఈమేరకు ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మందు తాగి వచ్చాడో, డ్రగ్స్ కొట్టి వచ్చాడో ఏమో ఏదేదో వాగాడని విమర్శించారు.

చిటికేస్తే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలను జైలులో పెట్టిస్తా అనడానికి పవన్ ఎవరని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ పవన్ కి సిగ్గు, బుద్ధి లేదా అని ఘాటుగా విమర్శించారు. పవన్ మాయావతి కాళ్ళు పట్టుకున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి పాదపూజ చేస్తూ మరోసారి పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అనిపించుకున్నాడని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మడం జరగదని హామీ తేగలవా అని పవన్ ను ప్రశ్నించారు.

Butchaiah Chowdary: జనసేనతో పొత్తు కుదిరితే బుచ్చయ్యచౌదరి త్యాగం చేస్తారా?

పవన్ కి మాట్లాడటం రాదు, ఇంగ్లీషు రాదు అని అమిత్ షా తనకు చెప్పాడని తెలిపారు. విశాఖలో మోదీ యాత్ర చేయడానికి పవన్ కు సిగ్గులేదా అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మబోమని మోదీతో ఆర్డర్ తీసుకురావాలని పవన్ కు ఛాలెంజ్ చేశారు. అమిత్ షాకు దండం పెట్టడం తప్ప కేంద్రంలో పవన్ కు అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు.

ఏపీ మీద ప్రేమ లేని వాడు జనసేనలో చేరతాడని పేర్కొన్నారు.  బుద్ధి, బుర్ర లేకుండా మాజీమంత్రి ఎవరో జనసేనలో చేరారని తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడని వెల్లడించారు. బీజేపీ, టీడీపీని తిట్టి బయటకు వచ్చి మళ్లీ 15 సీట్ల కోసం టీడీపీతో అంటకాగుతున్నాడని విమర్శించారు. పవన్, చిరంజీవి ప్యాకేజీ స్టార్ల మాటలు ప్రజలు నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

Kodangal Constituency: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?

తెలంగాణలో కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానని తెలిపారు.