Jayaprada : నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష ..

అలనాటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తు తీర్పునిచ్చింది.

Jayaprada : నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష ..

jayaprada Egmore court jail

Updated On : August 11, 2023 / 3:08 PM IST

Ex mp jayaprada Egmore court  jail : అలనాటి హీరోయిన్, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఓ కేసు విషయంలో సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తు ఎగ్మోర్ కోర్టు తీర్పునిచ్చింది. శుక్రవారం (ఆగస్టు11,2023) ‘జయప్రద’ థియేటర్‌ కాంప్లెక్స్‌ నిర్వహణకు సంబంధించిన కేసులో జయప్రదతో పాటు మరో ముగ్గురికి జైలు శిక్షతో పాటు రూ.5,000లు జరిమానా విధించింది.

చెన్నైలోని రామపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో పాటు జయప్రద ఈ థియేటర్ నడిపించగా రాను రాను ఈ థియేటర్ నష్టాలపాలైంది. నష్టాలు భరించలేక వీరంతా థియేటర్ ను మూసివేశారు. దీంతో థియేటర్ నిర్వహణలో కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు చెల్లించాల్సినది యాజమాన్యం చెల్లించలేదు.

దీంతో కార్మికులతో పాటు కార్పొరేషన్ కూడా ఎగ్మూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలో తాజాగా సంచలన తీర్పును వెలువరించింది. కేసు విచారణలో భాగంగా కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని సెటిల్ చేసుకుంటామని..వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామంటూ జయప్రద తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

Minister Temjen : వావ్ .. వెదురుబొంగుతో వాష్ బేషిన్, ఊరందరికి ఒక్కటే..

ఈ విషయంపై వివరణ ఇస్తు కోర్టులో మూడు పిటిషన్లను కూడా దాఖలు చేశారు. కానీ ధర్మాసనం ఈ పిటీషన్లు కొట్టివేసింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కు సంబంధించిన న్యాయవాది అభ్యంతారాన్ని మాత్రమే పరిగణిలోకి తీసుకుంది. అలా కేసు కొనసాగించి సుదీర్ఘ విచారణ అనంతరం ఈరోజు సంచలన తీర్పును వెలువరించింది. జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా విధించింది.

జయప్రద అసలు పేరు లలితా రాణి రావు. తెలుగు,హిందీ సినిమాల్లో నటించారు. గ్లామర్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెకున్న అందంతో కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ మరియు మరాఠీ చిత్రాలతో సహా పలు ప్రాంతీయ సినిమాలలో ప్రేక్షకులను మెప్పించారు. అలా తెలుగు నటి అయినా యూపీ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. రాంపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. అలా రాజకీయాల్లో ఆమె తనదైనశైలిలో ముద్ర వేసుకున్నా వివాదాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నా యాక్టివ్ గా కనిపించటంలేదు.

1994లో..జయప్రద తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో చేరారు. ప్రఖ్యాత నటి నుండి రాజకీయ వ్యక్తిగా మారిన ఈ మార్పు ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు కొత్త సవాళ్లను స్వీకరించారు. 2004 నుండి 2014 వరకు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుండి ఎంపీ పనిచేసినప్పుడు రాజకీయ ప్రయాణంలో మంచి స్థాయికి చేరుకున్నారు. రాంపూర్ అంటే జయప్రద..జయప్రద అంటే రాంపూర్ అనే పేరు తెచ్చుకున్నారు.

Sandwich: శాండ్‌విచ్‌ను కట్ చేసినందుకు కూడా బిల్ వేసిన రెస్టారెంట్ .. ప్రశ్నించిన కష్టమర్‌కు డబుల్ షాకులు