Minister Temjen : వావ్ .. వెదురుబొంగుతో వాష్ బేషిన్, ఊరందరికి ఒక్కటే..

పీహెచ్ డీ చేసిన ఇంజనీర్లకు కూడా రాని ఐడియాలో సామాన్యులకు కూడా ఎలా వస్తాయో... ఓ వెదురుబొంగును కూడా వాష్ బేసిన్ గా మార్చేయొచ్చని వారి ఎలా వచ్చిందో ఐడియా..ఒక్క వెదురు బొంగు ఊరందరికి వాష్ బేసిన్..ఐడియా అద్దిరిపోలా..

Minister Temjen : వావ్ .. వెదురుబొంగుతో వాష్ బేషిన్, ఊరందరికి ఒక్కటే..

Nagaland Villagers Bamboo Washbasin

Nagaland Minister Temjen Bamboo Washbasin : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగాలాండ్ (Nagaland)మంత్రి టెమ్‌జెన్‌ (Minister Temjen)ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. వాట్ యాన్ ఐడియా సర్ జీ అనేలా భారతీయుల క్రియేటివిటీకి నిదర్శంగా కనిపించో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను టెమ్ షేర్ చేశారు.

భారత్ లో సామాన్యులు చేసే పనులు..ప్లానులు చూస్తే ఇంజనీరింగ్ లో పీహెచ్ డీ చేసినవారు కూడా సరిపోరు అన్నట్లుగా ఉంటాయి. ‘వెదురు బొంగుతో తయారు చేసిన వాష్ బేసిన్ (Bamboo Washbasin) ను వీడియోకు నాగాలాండ్ నాగాలాండ్ ఉన్నత విద్య, పర్యాటక శాఖ మంత్రి టెబ్ జెన్ ఫిదా అయిపోయారు. దీంతో ఆయన ఆ వీడియోను షేర్ చేశారు.

Rajasthan Court : 11ఏళ్లనాటి కేసు .. సాక్ష్యం కోసం కోర్టుకు గేదె

వెదురుబొంగుతో తయారు చేసిన ఈ వాష్ బేషిన్‌ను ఒకరిద్దరు కాదు ఏకంగా ఊరు ఊరంతా ఉపయోగిస్తున్నారు. వెదురు గొట్టాలను అమర్చి దానిలో వాటర్ ప్రవహించేలా చేశారు. (Bamboo Washbasin). ఆ వెదురు గొట్టాలకు వరుసగా రంధ్రాలు చేసి స్టాపర్లను అమర్చారు. స్లాపర్లుగా వెదురు పుల్లను పెట్టారు. ప్రతి స్టాపర్ దగ్గరా సబ్బు, టవల్‌ను కూడా అందుబాటులో ఉంచారు. అంతే నాచ్యురల్ వెదురుబొంగు వాష్ బేసిన్ రెడీ..

ఆ గ్రామస్థుల క్రియేటివిటీ నాగాలాండ్ మంత్రి టెమ్‌జెన్‌ను ఫిదా అయిపోయారు. ఈ వీడియోను షేర్ చేస్తు ‘‘మీరు ఇలాంటిది ఎప్పుడైనా చూశారా?’’అంటూ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. వెదురుబొంగు వాష్ బేసిన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లక్షలామంది వీక్షించగా వేలాదిమంది లైఖ్ చేశారు.వాట్ యాన్ ఐడియా ఈ విలేజర్స్ ది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ బొంగు వాష్ బేసిన్ పై..