North facing sleep : ఉత్తరం వైపు పడుకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?

మనిషికి నిద్ర చాలా అవసరం. అయితే పడుకునేటపుడు సరైన దిశలో పడుకోవాలట. లేదంటే అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయట. అసలు ఏ దిశలో పడుకోవాలి?

North facing sleep : ఉత్తరం వైపు పడుకుంటే ఇన్ని సమస్యలు వస్తాయా?

North facing sleep

Updated On : August 11, 2023 / 2:15 PM IST

North facing sleep : మనిషికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే అవసరం. ఒకరోజు సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజు దాని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. నిద్ర శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందేలా సహాయపడుతుంది. అందుకే గాఢమైన నిద్రలోకి జారుకోవడం.. రాత్రిపూట నిర్ణీత గంటల సమయం నిద్రపోవడం అవసరం. ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు. అనారోగ్య కారణాలు కావచ్చు.. డిప్రెషన్ వంటి కారణాలు కావచ్చు. అయితే మీరు పడుకునే దిశ కూడా నిద్రలేమికి కారణమట. మీరు పడుకునేటపుడు ఏ దిక్కులో పడుకుంటున్నారు?

Sleepless Nights : మనం చేసే రోజువారి తప్పులే నిద్రలేని రాత్రులు గడపటానికి కారణమా ?

ఉత్తరం వైపు తల పెట్టి నిద్ర పోకూడదట. దీనికి కారణాలు ఉన్నాయి. భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల్లో అయస్కాంత క్షేత్రాలు కేంద్రీకృతం అయి ఉంటాయి. మీరు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోయేటపుడు మీ శరీరం యొక్క అయస్కాంత క్షేత్రం భూమికి అంతరాయం కలిగిస్తుంది. మీలో రక్తపోటు హెచ్చు తగ్గులకు గురిచేస్తుంది. అంతేకాదు అనేక శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయట. ముఖ్యంగా మెదడులో లోపాలు తలెత్తి నరాలు దెబ్బ తినే అవకాశం ఉంటుందట.

Sleepwalking : నిద్రలో నడిచే అలవాటు ప్రమాదకరమా?

రక్తంలో ఇనుము ఉంటుంది. మనం ఉత్తరంలో నిద్రిస్తున్నప్పుడు అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుంది. ఇది మెదడులో పేరుకుపోతోంది. నిద్ర లేవగానే కొందరిలో తలనొప్పికి అదే కారణమట. ఉత్తరంవైపు చెదిరిన నిద్ర వస్తుందట. ఇక పడుకోవడానికి తూర్పు, మరియు దక్షిణం అనుకూలమైన దిశలు. దక్షిణం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఉత్తర దిశ యొక్క ప్రతికూల ప్రభావాలను అది తిప్పి కొడుతుందట. రక్తపోటు కూడా అదుపులో ఉంటుందట. నిద్రపోయేటపుడు ఎడమవైపుకు పడుకుంటే మంచి నిద్ర వస్తుందట.