‘will cut your hands’ if you touch Savarkar’s posters
‘Will CUT YOUR HANDS if you touch Savarkar’ : కర్ణాటకలో వీర్ సావర్కర్ పై రాజకీయ దుమారం రేగుతున్న క్రమంలో హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యంపోశారు. కర్ణాటకలో ఎవరైనా..ఎక్కడైనా వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించటానికి టచ్ చేస్తే చేతులు నరికేస్తాం అంటూ హెచ్చరించారు. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి వ్యతిరకం తప్ప ముస్లింలకు కాదని ప్రమోద్ ముతాలిక్ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంస్థలు వీర్ సావర్కార్ పోస్టర్లు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో ముతాలిక్ హెచ్చరించారు.
శ్రీరామ్ సేన మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ హిందూ సేనకు ప్రమోద్ ముతాలిక్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వీర్ సావర్కార్ పోస్టర్లు వేయాలని నిర్ణయించారు. దీంతో పోస్టర్లను చించివేయటానికి ఎవరైనా యత్నిస్తేవారి చేతులు నరికేస్తాం అంటూ హెచ్చరించారు.ఈ సందర్భంగా ప్రమోద్ మాలిక్ మాట్లాడుతూ.. ‘‘వీర్ సావర్కార్ ముస్లింలకు వ్యతిరేకి కాదు. బ్రిటిషర్లకు మాత్రమే వ్యతిరేకి. ఏవరైనా ముస్లిం లేదా కాంగ్రెస్ కార్యకర్త వీర్ సావర్కార్ ఫొటో లేదా బ్యానర్ ను తొలగించడానికి టచ్ చేస్తే వారి చేతులను నరికేస్తాం. ఇదే మా హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు.. వీర్ సావర్కార్ 23 ఏళ్లపాటు జాతి కోసం పోరాడేందుకు తన జీవితాన్ని ధారపోశారని ఆయన త్యాగాలను కీర్తించాలని..అటువంటి మహనీయుడి పోస్టర్లను తొలగించటానికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఘాటుగా హెచ్చరించారు ప్రమోద్ ముతాలిక్.ఇందిరాగాంధీ స్వయంగా స్టాంప్ తెచ్చిన సావర్కర్‌ను సత్కరించారని..కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు అర్థరహితమైన ప్రకటనలు చేస్తున్నారని..స్వాతంత్య్ర సమరయోధులను అవమానిస్తే మేం ఊరుకోబోమని ప్రమోద్ ముతాలిక్ విలేకరులతో మాట్లాడుతూ హెచ్చరించారు.
గణేశ్ చతుర్ది సందర్భంగా వీర్ సావర్కార్ తో పాటు, బాలగంగాధర్ తిలక్ ఫోటోలు అంటించాలని నిర్ణయించామరి హిందూ మహాసభ గౌరీ గణేశ్ సేవా సమితి ప్రెసిడెంట్ రాకేశ్ రామమూర్తి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ప్రాంతాల్లో వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్‌ల ఫొటోలు పెట్టాలని నిర్ణయించుకున్నామని..ఈ ఇద్దరు దిగ్గజ స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించేందుకు ఓ ఉద్యమంలా చేయాలనుకుంటున్నామని ప్రమోద్ ముతాలిక్ తెలిపారు.