ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌ బోర్డుపై జిహాద్ టెర్రరిస్ట్ పోస్టర్లు

Jihadi: హిందూ సేన రైట్ వింగ్.. ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ బోర్డుపై ‘జిహాదీ టెర్రరిస్టు ఇస్లామిక్ సెంటర్’ పోస్టర్లు అంటించారు. హిందూ సేన ప్రెసిడెంట్ విష్ణు గుప్తా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో, ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు చేస్తున్నందుకు ముస్లింలపై కోపంగా ఉన్నామని అన్నారు.
https://10tv.in/job-lost-with-corona-effect-haryana-man-when-she-went-to-work-started-a-food-stall-on-her-own-scooty/
ఫ్రాన్స్‌లో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు రోజురోజుకూ పెరగడంతో గుప్తా ఇండియాలో జరుగుతున్న ఆగడాలపై సైతం గొంతెత్తాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇస్లామిక్ ఆటంకవాదులు మరిన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భోపాల్, అలీఘఢ్ లో ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న ఆందోళనలను ప్రస్తావించారు.



ఈ గ్రూపు బోర్డుపై పోస్టర్లు అంటించడం తొలిసారేం కాదు. 2019లో బాబర్ రోడ్‌లోని బోర్డుపైనా.. ఇవాళ బెంగాలీ మార్కెట్ లోనూ అదే విధంగా చేశారు. అంతేకాకుండా మొగలాయి వంశస్థుడి పేరు మార్చాలని విదేశీయుడంటూ డిమాండ్ చేశారు.