నాలుగు నెలల ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినందుకు చెన్నై నగరంలోని కుంద్రాత్తూర్‌లో 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ బ్యాంకు ఉద్యోగి గుణశేఖరన్(50) తన ఇంట్లో ఒక భాగాన్ని మెకానిక్-కమ్-డ్రైవర్ అయిన అజిత్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అయితే లాక్‌డౌన్ కారణంగా పనులు లేక అతను నిరుద్యోగిగా మారిపోవడంతో నాలుగు నెలలుగా తన నెలవారీ అద్దె రూ .4వేలు చెల్లించలేదు.
కోపంతో, అజిత్ గుణశేఖరన్ ఇంట్లోకి ప్రవేశించి, కిచెన్‌లో కత్తి తీసుకున్నాడు. గుణశేఖరన్ తనను తాను రక్షించుకోవడానికి ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు, కాని జారిపడి రోడ్డు మీద పడిపోయాడు.
తన దాడిని కొనసాగిస్తూ, అజిత్ గుణశేఖరన్ మెడను రోడ్డుపై కోసి, అతని తల, ఛాతీ మరియు పొట్టలో పదేపదే పొడిచాడు. తరువాత, అతను గుణశేఖరన్ కాలును తన లుంగీతో కట్టేశారు.
కుంద్రాతుర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుణశేఖరన్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం క్రోమేపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అజిత్‌ను కూడా పట్టుకుని హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Here>>కుప్పం సరిహద్దుల్లో దారుణ హత్య..