Kottayam Hot Weather : దేశవ్యాప్తంగా చలి చంపుతుంటే.. అక్కడ మాత్రం ఎండలు మండిపోతున్నాయి

దేశవ్యాప్తంగా చలి చంపేస్తుంటే.. కేరళలోని కొట్టాయంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

Kottayam Hot Weather : దేశవ్యాప్తంగా చలి చంపేస్తుంటే.. కేరళలోని కొట్టాయంలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

కొట్టాయంలో వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ చలి కాదు కదా కనీసం చల్లటి వాతావరణం కూడా లేదు. అక్కడ వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. భానుడు భగభగ మంటున్నాడు. తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో అక్కడ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి.

Also Read..Kanpur Cold Wave : ఉత్తరప్రదేశ్‍లో కలకలం.. ఒక్కరోజే 25మంది మృతి..హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణాలు

నిన్న కొట్టాయంలో గరిష్టంగా 35 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న వారం రోజుల పాటు అక్కడ పగటి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. వాతావరణం చల్లగా ఉండాల్సిన ఈ సమయంలో ఎండలు మండిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇది చలి కాలమా? ఎండా కాలమా? అనే సందేహం కలుగుతోంది. సమ్మర్ అప్పుడే వచ్చేసిందా అనే డిస్కషన్ జరుగుతోంది. మండిపోతున్న ఎండలతో జనం చుక్కలు చూస్తున్నారు.

ఎండ తీవ్రత తట్టుకోలేక ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొందరేమో గొడుగులతో రోడ్డెక్కుతున్నారు. మరోవైపు విపరీతమైన దాహం వేస్తోంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానియాలు సేవిస్తున్నారు. సీజన్ కు భిన్నంగా మండిపోతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో అనూహ్య మార్పులు కొట్టాయం వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Also Read..Cold And Snow Delhi : ఢిల్లీపై చలి పంజా, దట్టమైన పొగమంచు.. గజ గజ వణికిపోతున్న ప్రజలు

కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి చంపేస్తోంది. చలి తీవ్రత అధికంగా ఉంది. పలు ప్రాంతాల్లో వెన్నులో వణుకు పుట్టించే చలి ఉంది. ఇక హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఎముకలు కొరికే చలితో జనం విలవిలలాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చెయ్యడం లేదు. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలోనే కొట్టాయంలో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. అక్కడ భానుడు తీవ్రంగా ప్రతాపం చూపిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు