Uttarakhand : కళ్ళముందే కుప్పకూలిన హోటల్.. వైరల్ వీడియో

ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.

Uttarakhand

Uttarakhand : ఉత్తరాఖండ్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల దాటికి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇక శనివారం ఓ హోటల్ భవనం కుప్పకూలింది.

జోషిమఠ్‌లోని ఝాడ్కుల సమీపంలో ఈ ఘటన జరిగింది. భవనం కూలేలా ఉందని ముందే ఊహించిన అధికారులు అందులోని వారిని ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా హోటల్ మెయిన్ రోడ్డుకు అనుకోని ఉండగా పక్కనే పెద్ద లోయ ఉంది. వర్షాల కారణంగా లోయలోని మట్టి క్రమంగా జారీ కిందకు పోవడంతో భవనం కుప్పకూలింది.

ఇక ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ గా మారింది. మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ కొండ ఎప్పుడు కూలుతుందో తెలియక స్థానికులు భయపడిపోతున్నారు.