Hungary
Hungary : సింగర్-కంపోజర్ శంకర్ మహదేవన్ అందరికీ పరిచయం ఉన్నవారే. రీసెంట్‌గా ఓ వ్యక్తి టాలెంట్ ఆయనను ఆశ్చర్యానికి గురి చేసింది. శంకర్ మహదేవన్ హంగేరీ పర్యటనలో ఉండగా ఓ హోటల్ మేనేజర్ శాస్త్రీయ సంగీతం పాడటం.. తాను నేర్చుకుంటున్నట్లు చెప్పడం ఆయనను మెస్మరైజ్ చేసింది.
Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి
శంకర్ మహదేవన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (shankar.mahadevan) ఒక పోస్ట్ పెట్టారు. హంగేరీ పర్యటనలో ఉన్న ఆయనకు కార్నెల్ మగ్యార్ అనే హోటల్ మేనేజ్ సంగీత ప్రతిభ ఎంతగానో నచ్చేసింది. ‘కొన్ని ప్రదేశాల్లో ఊహించని అద్భుతమైన సంఘటనలు జరుగుతుంటాయి.కార్నల్ మా హోటల్ మ్యూజిక్ మేనేజర్‌ని కలవడం చాలా బాగుంది. ఎంతటి లయ బద్ధమైన సంగీతం’ అనే క్యాప్షన్‌తో హోటల్ మేనేజర్ కార్నల్ గురించి శంకర్ మహదేవన్ పోస్టు పెట్టారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.
మగ్యార్ బుడాపెస్ట్‌లోని ఏరియా హోటల్‌లో పనిచేస్తున్నారు. తనకు చక్కని సంగీతాన్ని నేర్పిన తన గురువు ప్రొఫెసర్ ట్రిచ్చి శంకరన్‌దే ఈ క్రెడిట్ అంతా అని మగ్యార్ చెప్పాడట. ఈ వీడియో చూసిన వారంతా ‘సంగీతానికి భాష ఎటువంటి అడ్డంకులు లేవని మగ్యార్ నిరూపించాడని కితాబు ఇచ్చారు. శంకర్ మహదేవన్ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.