చక్కగా ఉన్న ఇల్లు..క్షణాల్లో ఎలా కూలిపోయిందో చూడండీ  

  • Publish Date - September 16, 2019 / 07:18 AM IST

వర్షాల కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన ప్రజలకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, సరస్సులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ఈదురుగాలులతో కూడిన వర్షాల ధాటికి బైరియా తహసీల్ పరిధిలోని కెహర్ పూర్ గ్రామంలో గంగానదికి సమీపంలో ఓ ఇళ్లు కుప్పకూలిపోయింది. అప్పటివరకు చక్కగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నేలమట్టమైంది.కాగా..ఇంట్లో లేకపోవడంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. 
 

.