అంతా మన చేతిలోనే.. మనమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతున్నాం.. అంతా అయిపొయింది. రేపు గవర్నర్‌ని కలుద్దాం… ఎల్లుండు ప్రమాణ స్వీకారం చేద్దాం. ఈరోజు హాయిగా నిద్ర పోండి. అని చెప్పేసింది శివసేన. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారం వదులుకుంటుందా? రాష్ట్రంలో అధికారాన్ని అంత ఈజీగా వదులుకుంటుందా? ఏ నాయకుడు.. ఏ ఎనలిస్ట్.. ఏ జర్నలిస్టు.. అంచనా వెయ్యలేని విధంగా రాజకీయం నడిపింది బీజేపీ.
శివసేన చేతులెత్తేయగానే బీజేపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉన్న ఏకైక పార్టీ ఎన్‌సీపీ. అటువైపుగానే పావులు కదిపింది బీజేపీ. ఈ క్రమంలోనే మోడీ పార్లమెంటులో ఎన్‌సీపీని పొగిడాడు. శరద్ పవార్ మోడీని కలుసుకున్నాడు.. బీజేపీ-ఎన్‌సీపీ చర్చలు తెరవెనుక సాగిపోయాయి. అంతే శివసేన నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకిరం చేసేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నకొడుకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. దీంతో శివసేన అంచనాలు తారుమారయ్యాయి.
అయితే ఇది రాత్రికి రాత్రే ఒక్కరోజులో జరిగిన పరిణామం అయితే కాదు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, మీడియా ఫోకస్ లేకుండా.. ఎవ్వరికీ అనుమానం రాకుండా చర్చలు జరిపింది బీజేపీ అధినాయకత్వం. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యేందుకు చివరి చర్చలు కూడా జరిగాయి. మరోవైపు మహారాష్ట్రలో మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు వంద శాతం లేవు అని పార్టీలోని ప్రతి సీనియర్ నాయకుడు, కార్యకర్తలు భావించారు. అయితే చివరకు మాత్రం బీజేపీనే మళ్లీ అధికారంలోకి వచ్చింది.
అయితే అంతకుముందు శివ సేన-ఎన్‌సీపీ-కాంగ్రెస్ కూటమి ఏర్పడే అవకాశం లేదనే ఆశతో వెయిట్ చేసిన బీజేపీ ఆ మూడు పార్టీల పొత్తులను చూస్తూ ఉంది. చివరకు వచ్చింది అనుకున్న క్రమంలోనే రాష్ట్రపతి పాలన తెల్లవారుజామున రద్దు చేసి, ఫడ్నవీస్ మరియు పవార్‌లు రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్‌ని చివరివరకు లైన్‌లో పెట్టారు. ఈ విషయం బయటకు రాకుండా, ఎవ్వరికీ లీక్ కాకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
ఈ క్రమంలోనే సర్జికల్ స్ట్రైక్ తరహాలోనే బీజేపీపై రాజకీయంగా లక్షిత దాడి చేసింది. అందులో భాగంగానే ఉద్దవ్ ఠాక్రే భార్య రష్మి తన కొడుకు సీఎం కావాలని పట్టుపట్టినప్పుడు చూశారు. ఎన్నికలకు ముందు అనుకున్నట్టుగా గాకుండా మాకే సీఎం పీఠం కావాలని శివసేన పట్టుపట్టిన బెదరలేదు. అవసరమైతే కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతు తీసుకునే క్రమంలో అడుగులు వేసిన శివసేనను తర్వాత కూడా టార్గెట్ చేయడానికి అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. శివసేనకు సీఎం పోస్టు ఇచ్చినా, రోజూ శివ సేనతో తంటాలే అనే భావనతో టెంపరరీగా రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టేసి, రాజకీయాలు ఎలా మారుతున్నాయి అనేది చూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే అంతకుముందు అక్టోబర్ 30వ తేదీన ఎన్‌సీపీ ఫ్లోర్ లీడర్‌గా అజిత్ పవార్‌పై ఎన్నికయ్యారు. శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్‌ను తమ ఆటలోకి లాగేసుకున్నారు. సీబీఐ, ఈడీ కేసుల్లో పీకల్లోతు మునిగిన పవార్‌ను తమ గూట్లోకి లాక్కునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద కష్టం అనిపించలేదు. అంతిమంగా శివసేనను అధికారానికి ఏ మాత్రం అవకాశం లేకుండా క్లీన్ బౌల్డ్ చేసింది బీజేపీ.
చివరకు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, మొత్తం రాజకీయ వర్గాలు షాక్ అయ్యాయి. అయితే అంతకు ముందే కేంద్రమంత్రులు మహారాష్ట్రలో మా ప్రభుత్వం వస్తుందని అమిత్ షా చెప్పారని అన్నప్పుడు కూడా ఎవ్వరూ అంచనా వెయ్యలేదు ఇటువంటి ఒక ప్లాన్ వెనుక ఉంది అని, బీజేపీకి 120 మంది ఎమ్మెల్యేలు స్వతంత్రులతో కలిపి ఉండడగా.. ఎన్‌సీపీకి చెందిన 54 మందిలో 30మంది సపోర్ట్ చేసినా కూడా ప్రభుత్వం స్ట్రాంగ్ ఇంక ఇబ్బందేం లేదు. అయితే ఎన్‌సీపీలో 54మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారని, ఇప్పుడు తమ బలం 174మంది అని చెబుతుంది బీజేపీ.