Indian Railways : ప్రాణదాత.. ఎందరో కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడిన ఇండియన్ రైల్వేస్

దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట్ల కోసం రైలు కోచ్ లు కోవిడ్ కేర్ యూనిట్లుగా మారాయి. రియల్ లైఫ్ లైన్ లా వ్యవహరిస్తోంది. కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో ముఖ్యమైన భూమిక పోషిస్తోంది భారతీయ రైల్వేస్.

Indian Railways : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజారవాణ వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. రైళ్లను తమ విమానంగా పేదవాడు భావిస్తాడు. అందుబాటు ధరలో నిత్యం లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. సురక్షితమైన ప్రయాణానికి కేరాఫ్ గా నిలిచింది. భారతీయులతో ప్రత్యేక అనుబంధం ఉంది. దేశానికి లైఫ్ లైన్ గా నిలుస్తున్న ఇండియన్ రైల్వేస్.. కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరాటంలో తనదైన పాత్ర పోషించింది. కరోనా సంక్షోభంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ని పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది ఇండియన్ రైల్వేస్. అంతేకాదు కరోనా పేషెంట్ల కోసం రైలు కోచ్ లను కోవిడ్ కేర్ యూనిట్లుగా మార్చింది. ఈ కష్టకాలంలో రియల్ లైఫ్ లైన్ లా వ్యవహరిస్తోంది. సరైన సమయానికి ఆక్సిజన్ సరఫరా చేస్తూ, ట్రీట్ మెంట్ ఇస్తూ.. ఎందరో కరోనా రోగుల ప్రాణాలు కాపాడటంలో ముఖ్యమైన భూమిక పోషిస్తోంది భారతీయ రైల్వేస్.

మధ్యప్రదేశ్ లో ఇండియన్ రైల్వేస్ కోవిడ్ కేర్ యూనిట్:
ఇండియన్ రైల్వేస్ మధ్యప్రదేశ్ లో ప్రత్యేక సదుపాయాలతో కోవిడ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.

ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్:
కోవిడ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేయడమే కాదు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ కూడా రన్ చేస్తోంది ఇండియన్ రైల్వేస్. కరోనా రోగుల ప్రాణాలు నిలిపే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. కోవిడ్ పై పోరాటంలో అలా కీలక పాత్ర పోషిస్తోంది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కోవిడ్ కేర్ యూనిట్లు:
మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇండియన్ రైల్వేస్ 22 అదనపు కోవిడ్ కేర్ కోచ్ లు ఏర్పాటు చేసింది. కరోనా రోగులకు ఈ కోచ్ లలో చికిత్స అందిస్తున్నారు.

భోపాల్ చేరిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్:
ఏప్రిల్ 28న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ 60 ఆక్సిజన్ ట్యాంకులతో జార్ఖండ్ బొకారో నుంచి బయలుదేరి భోపాల్ లోని మణిదీప్ రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇందులో రెండు ట్యాంకర్లు మణిదీప్, సాగర్ లో అన్ లోడ్ చేశారు. మరో ట్యాంకర్ జబల్ పూర్ పంపారు.

నాగ్ పూర్ లో కోవిడ్ కేర్ యూనిట్లు:
నాగ్ పూర్ లో ఇండియన్ రైల్వేస్ 11 కోవిడ్ కేర్ కోచ్ లు ఏర్పాటు చేయనుంది. ఈ కోచ్ లలో 170మందికిపైగా కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాదాపుగా 60వేల బెడ్లతో 4వేల ఐసోలేషన్ కోచ్ లు ఏర్పాటు చేసింది.

క్రమం తప్పకుండా రైళ్ల శానిటైజేషన్:
కరోనా కట్టడికి రైల్వే అన్ని రకాల చర్యల చేపడుతోంది. నిత్యం రైళ్లను శానిటైజ్ చేస్తోంది. కరోనా వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఢిల్లీ చేరిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్:
ఏప్రిల్ 27న ఢిల్లీకి తొలి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ చేరింది. మే 2న రెండో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ఢిల్లీ చేరింది. 120 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తీసుకొచ్చింది. మూడో ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ సైతం త్వరలో ఢిల్లీ చేరనుంది. అందులో 30.86 టన్నుల ఆక్సిజన్ తెస్తోంది.

భోపాల్ లో కోవిడ్ కేర్ యూనిట్లు:
భారతీయ రైల్వే 320 ఐసోలేషన్ బెడ్లతో 20 కోవిడ్ కేర్ కోచ్ లను భోపాల్ లో ఏర్పాటు చేసింది. ఈ కోచ్ లలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ఈ కోచ్ లలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.

బెంగళూరులో కోవిడ్ కేర్ సెంటర్:
కర్నాటక రాజధాని బెంగళూరులోనూ భారతీయ రైల్వే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 25న బెంగళూరులోని రైల్ వీల్ ఫ్యాక్టరీ కమ్యూనిటీ హాల్ లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసింది. RWF కి చెందిన 12వేల మంది ఉద్యోగులు, రిటైర్ అయిన వారికి, వారి కుటుంబసభ్యులకు ఈ సెంటర్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.

వెయ్యి టన్నుల ఆక్సిజన్ సరఫరా:
భారతీయ రైల్వే ఇప్పటివరకు 19 ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ నడిపింది. వీటి ద్వారా 74 ట్యాంకుల్లో 1094 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేసింది. అసోం ప్రభుత్వం విజ్ఞప్తితో భారతీయ రైల్వే కోవిడ్ కేర్ కోచ్ లు ఏర్పాటు చేసే పనిలో ఉంది.

థ్యాంక్యూ ఇండియన్ రైల్వేస్:
ఇప్పటివరకు భారతీయ రైల్వే 1094 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేసింది. మహారాష్ట్రకు 174 టన్నులు, ఉత్తరప్రదేశ్ కు 430.51 టన్నులు, మధ్యప్రదేశ్ కు 156.96 టన్నులు, ఢిల్లీకి 190 టన్నులు, హర్యానాకు 79 టన్నులు, తెలంగాణకు 63.6 టన్నుల ఆక్సిజన్ చేరింది.

ట్రెండింగ్ వార్తలు