PM Modi at UNGA: 75వ United Nations General Assembly (UNGA)లో మోడీ సింహనాదం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత మరింత పెద్ద పాత్రను పోషించాలని ప్రతి భారతీయుడు కోరుకొంటున్నాడని వర్చువల్ ప్రసంగంలో మోడీ వ్యాఖ్యానించారు.
మోడీ ప్రసంగాన్ని ఇంతకుముందే రికార్డు చేసి, న్యూయార్క్ జనరల్ అసెంబ్లీ హాలులో ప్రసారం చేశారు. కరోనా వల్ల యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఎక్కువ మంది వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
అసలు ఐక్యరాజ్యసమితి సంస్కరణల ప్రక్రియ సరైన ముగింపుకు ఎప్పటికైనా వస్తుందా అని ఈరోజు భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఐక్యరాజ్యసమితిలో నిర్ణయాత్మక వ్యవస్థకి ఎంతకాలం ఇండియాను దూరంగా ఉంచగలరని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ప్రశ్నించారు మోడీ.
130 కోట్ల భారతీయులకు ఐక్యరాజ్యసమితి పట్ల నమ్మకం, గౌరవం తిరుగులేనివని అయన వ్యాఖ్యానించారు.
మేం బలంగా ఉన్నాప్పుడు, ఏనాడు ప్రపంచ శాంతికి ముప్పుగా మారలేదు. మేం బలహీనంగా ఉన్నప్పుడుకూడా ఈ ప్రపంచానికి భారంకాలేదు. ఒక దేశం మౌలికంగా మార్పు చెందుతూ ఈ ప్రపంచంమీదనే ప్రభావం చూపిస్తున్నప్పుడు, మేం ఎంతకాలం వేచిచూడాలి? అని హిందిలో సూటిగా యుఎన్‌ను అడిగారు.
అవసరాలకు తగ్గుట్టుగా ఐక్యరాజ్యసమితి స్పందించాలి. మారాలి. మనం పూర్తిగా వేరే యుగంలో ఉన్నాం. ఈనాడున్న పరిస్థితుల్లోనే ఒకనాడు ఎర్పడిన ఈ సంస్థ, ఇప్పటి అవసరాలను తీర్చగలదా? ఈ ప్రశ్నే ప్రపంచ సమాజం ముందుందని మోడీ అన్నారు.