Crying Benefits : ఏడవటానికి సంకోచించొద్దు..ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలో

ఎవరన్నా ఏడిస్తే ఊరుకోమ్మా ఏడవకు అని ఓదారుస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం ఏడవండీ ఏడిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసుకోండీ అంటున్నారు.

Crying Benefits

Crying Benefits: ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. ఏ కన్నీటి వెనకాల ఏముందో తెలుసుకో’ అని మనస్సు కవి ఆత్రేయ రాసిన పాటలో నిజంగా ఎంత అర్థం ఉందో అంతటి పరమార్థం కూడా ఉంది. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి. కానీ ఏడిస్తే మనిషికి మంచిది అని చెబుతున్నారు నిపుణులు. మనసులోని భావోద్వేగాలను ఆపుకోలేకపోతే అది కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. వాటినే కన్నీళ్లు అంటాం. ఆడవాళ్ల ఏడిస్తే ‘ప్రతీదానికి ఎందుకు ఏడుస్తావు‘ అంటారు..విసుక్కుంటారు మగవాళ్లు. అదే మగవాళ్లు ఏడిస్తే ‘ఏంటిరా ఆడదానిలా ఏడుస్తావు’ అంటారు. అంటే భావోద్వేగాలు ఆడవారికి మగవారికి ఒక్కలాగానే ఉంటాయి. కానీ ఆడవారు సున్నిత మనస్కులు కాబట్టి త్వరగా ఏడుస్తారు. కానీ మగవారికి బాధ వచ్చిన ఏడ్వటానికి సంకోచిస్తారు.తమను ఎవరు చులకన అవుతామోనని..కానీ ఏడవటం చాలామంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఏడ్వడం వల్ల అనేక ఉపయోగాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరం భావాలకు ప్రతిస్పందించినప్పుడు, మనసు కన్నీటి గ్రంథి నుంచి కళ్ల ద్వారా బయటకు వచ్చే నీటిని కన్నీళ్లు అంటాం అని చెప్పుకున్నాం కదా..ఈ కన్నీళ్ల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుండే ఏడవటానికి ఎవ్వరూ సంకోచించరు..ఏడుపు గురించి వైద్య నిపుణులు ఇలా అంటున్నారు. నవ్వు ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో.. ఏడుపు కూడా అంతే ముఖ్యం అంటున్నారు. బాధపడుతూ ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ అనే ఫీల్‌ గుడ్‌ రసాయనాలు విడుదలవుతాయి. కన్నీళ్ల వల్ల చెడు ఆలోచనలు దూరమైన, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్‌ ఆలోచనల వైపు దృష్టి మళ్లుతుంది.

కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ ఉంటుంది. కన్నీళ్ల వల్ల కళ్లలో ఉండే దుమ్ము, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఏడవడం వల్ల మెదుడు, శరీర ఉష్ణోగ్రతలు క్రమపద్దతిలో ఉంటాయి. అలాగే ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్‌ వల్ల శారీరక, మానసిక భావోద్వేగాల్లో మార్పులు కలుగుతాయి. శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. బాధ కలిగినప్పుడు ఏడిస్తే మనస్సులో భారం అంతా దిగిపోయి మనస్సు తేలిక పడుతుంది. ఉల్లిపాయ కోసినప్పుడు, కంటిలో దుమ్మూధూళి పడినప్పుడు కళ్ల మంట తగ్గించడానికి రెప్లెక్స్‌ టియర్స్‌ ఉపయోగపడుతుంది.

ఏడిస్తే దూరమయ్యే మానసిక ఒత్తిడి…
ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. కన్నీళ్లలో కొన్ని విషపూరిత అంశాలు బయటకు వస్తాయి. ఇది శరీరంలోని ఒత్తిడి హర్మోన్ల ఉత్పత్తి తగ్గిస్తుంది. భావోద్వేగ కన్నీళ్లలో లైసోజైమ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు సహాజ ప్రక్షాళనగా పని చేస్తాయి. అలాగే ఏడుపు వల్ల కలిగే మరో ఆరోగ్య ప్రయోజనం ఏంటంటే ఇది కంటికి తేమను ఇస్తుంది. ఏడుపు కళ్ల పొడిదనాన్ని తగ్గిస్తుంది. ఏడుపు డిప్రెషన్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

శిశువు పుట్టగానే ఏడ్చే ఏడుపు వారి పుట్టుకకు నిదర్శనం
స్త్రీ గర్భం నుంచి ప్రసవం ద్వారా ఈలోకంలోకి వచ్చిన శిశువు మొట్టమొదటి ఏడుపు చాలా ముఖ్యం. ఏడుపుతోనే పుట్టుక..ఏడుపుతోనే జీవితం మొదలవుతుంది. శిశువు తల్లి గర్భంలోంచి బయటపడ్డాక బొడ్డు తాడు ద్వారా గర్భం లోపల తమ ఆక్సిజన్‌ను ఆందుకుంటారు. ఒక బిడ్డ ప్రసవించిన తర్వాత వారు స్వయంగ శ్వాసించడం ప్రారంభించాలి. మొదటి ఏడుపు ఏమిటంటే శిశువు ఊపిరితిత్తులు బయటి ప్రపంచంలో జీవితానికి అనుగుణంగా సహాయపడతాయి. ఏడుపు పిల్లలు ఊపిరితిత్తులు, ముక్కు మరియు నోటి ఏదైనా అదనపు ద్రవాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.

పిల్లలు నిద్రపోవడానికి..ఏడుపు మంచిదే..
ఏడుపు పిల్లలు రాత్రి బాగా నిద్రపోవడానికి కూడా ఎంతగానో సహాయపడుతాయని చైల్డ్‌ సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఏడిస్తే కాసేపు అలా ఏడవనివ్వండి అని చెబుతున్నారు.అలా ఏడ్చిన పిల్లలు తరువాత చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. బాగా ఏడ్చి ఏడ్చిన పడుకున్న పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు. అలా నిద్రపోయాక ప్రశాంతంగా నిద్రలేస్తారని చెబుతున్నారు.ఏడ్చి నిద్రపోయే పిల్లలు ఎక్కువ సేపు నిద్రించడాన్ని ఉపయోగపడినట్లు పరిశోధకులు గుర్తించారు. అలా ఏడ్చి నిద్రపోయిన పిల్లలు రాత్రి సమయంలో నిద్రలేవరని తేలింది.