Covid Vaccine Registration
Covid Vaccine Registration : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ విలయతాండవం చేస్తోంది. కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 18ఏళ్లు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతినిచ్చింది. అయితే మీకు 18 ఏళ్లు నిండాయా? టీకా తీసుకోవాలనుకునే వారు CoWIN వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందరికి వ్యాక్సిన్ అనుమతి ఇవ్వడంతో రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
అందుకే ముందుగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. అప్పటికప్పుడూ టీకా సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కుదరదన్నారు. కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. షెడ్యూల్ తేదీలను కూడా మార్చుకోవచ్చు. కొవిన్ వెబ్ సైటులో టీకా పొందేందుకు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో ఓసారి చూద్దాం..
రిజిస్టర్ చేసుకోండిలా :
– కొవిన్ పోర్టల్ (cowin.gov.in) లాగిన్ అవ్వండి.
– మొబైల్ నంబర్ ఎంటర్ చేసి Get OTPపై క్లిక్ చేయండి.
– మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.. వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయండి.. వెరిఫై బటన్‌పై క్లిక్ చేయండి.
– రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ పేజి ఓపెన్ అవుతుంది.
– ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకోవాలి.
– గుర్తింపు కార్డు నంబర్‌తో పాటు పేరు, పుట్టిన సంవత్సరం వివరాలను నమోదు చేసుకోవాలి.
– వివరాలు పూర్తి చేశాక రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయండి.
– రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాలి.
– షెడ్యూల్ బటన్‌పై క్లిక్ చేయండి.
– మరో పేజి ఓపెన్ అవుతుంది. మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి..
– టీకా కేంద్రాల లిస్టు వస్తుంది. అందులో తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసుకోండి.
– కన్ఫార్మ్ బటన్‌పై క్లిక్ చేస్తే చాలు.. మీ టీకా రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టే..