డబ్బు కట్టకుండానే ట్రీట్‌మెంట్.. క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ ఎలా ఉపయోగించుకోవాలి? నిబంధనలు ఏంటి?

క్యాష్ లెస్ సదుపాయంపై అవగాహన కల్పిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

How To Use Cashless Treatment

Cashless Treatment : దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం వచ్చి వారం రోజులు అవుతోంది. కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నప్పటికీ ప్రజలకు మేలు జరగబోతోంది. ఇప్పటివరకు కేవలం 63శాతం మంది మాత్రమే క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ సేవలను వినియోగించుకుంటున్నారు. మిగతా 37శాతం మంది ముందుగా డబ్బులు చెల్లించి తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు. ప్రస్తుతం క్యాష్ లెస్ సదుపాయంపై అవగాహన కల్పిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

* క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ ను ఏ ఆసుపత్రిలోనైనా ఉపయోగించుకోవాలి అంటే..
* 48 గంటల ముందు సంబంధించిన హాస్పిటల్ తో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి.
* అంటే ముందస్తుగా ప్లాన్ చేసుకున్న సర్జరీలు, చికిత్సకు ఇది వర్తిస్తుంది.
* ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసుల్లో ముందుగా పేషెంట్ ను అడ్మిట్ చేయాల్సి వస్తే ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోగా ఇన్సూరెన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి.
* క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి ఆసుపత్రి యాజమాన్యం ఆథరైజేషన్ మెయిల్ పంపాల్సి ఉంటుంది.
* సంబంధించిన ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలాంటి అవగాహన ఒప్పందం లేకున్నా డబ్బులు కట్టకుండానే ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు.
* ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ పేర్కొంది.
* ఒకవేళ 48 గంటల్లోగా సంప్రదించకపోతే క్యాష్ లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవడం కుదరదు.

* ఆ తర్వాత బిల్లులు పెట్టుకుని ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
* క్యాష్ లెస్ సదుపాయం ద్వారా హాస్పిటల్స్ తో పాటు చాలామంది ప్రజలకు ఉపయోగం కలుగుతుంది.
* దీనిపై అవగాహన మరింత పెరిగితే చాలామంది సద్వినియోగం చేసుకుంటారు.
* హాస్పిటల్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇన్సూరెన్స్ సంస్థలకు తెలియడం ద్వారా మోసాలు కూడా అరికట్టడానికి వీలు కలుగుతుంది.
* అక్రమంగా క్లెయిమ్స్ పెట్టే వారి సంఖ్యా తగ్గుతుంది.
* హెల్త్ ఇన్సూరెన్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.

* ఇక మూరుమూల ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా క్యాష్ లెస్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
* భవిష్యత్తులో కేవలం వాట్సాప్ ద్వారానే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు.
* ప్రస్తుతం ఈమెయిల్ ద్వారా జరుగుతోంది.
* ఇన్సూరెన్స్ పాలసీ నెట్ వర్క్ జాబితాలో పేరు లేని ఆసుపత్రిలోనూ క్యాష్ లెస్ సదుపాయాన్ని పొందొచ్చు.
* ప్రస్తుతం ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో మాత్రమే క్యాష్ లెస్ కు అనుమతి ఉంది.
* క్యాష్ లెస్ సదుపాయం లేని చోట ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చుని చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రీఎంబర్స్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
* ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటం, రీఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

* ఇక నుంచి ఈ సమస్యలు తప్పబోతున్నాయి.
* క్యాష్ లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు అవగాహన కల్పిస్తున్నాయి.
* జనవరి 25న ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
* రీఫండ్ ప్రక్రియ వల్ల కస్టమర్లు ఆర్థికంగా ఒత్తిడితో పాటు క్లెయిమ్ చేసుకునే విషయంలో కూడా అవాంతరాలు ఎదుర్కొంటున్నారు.
* ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికే నిర్ణయం తీసుకున్నారు.
* మోసాలను అరికట్టి కస్టమర్ల విశ్వాసం పొందేందుకు ఇది ఉపకరించబోతోంది.