వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజలపాటు లాక్ డౌన్ విధించింది. విమానాలు, రైళ్లు, బస్సులు, ప్రభుత్వం, ప్రైవేట్ కార్యాలయాలను బంద్ చేశారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు, వలస కార్మికులు కాలిక నడకన సొంతూళ్లకు వెళ్తున్నారు.
వలస కార్మికులు రోడ్డుపై కాలినడకన ఇంటికి వెళ్తున్నట్లు ఉన్న అనేక ఫోటోలు వైరల్ కావడంతో విమాన వాహక నౌక స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వలస కార్మికులను ఢిల్లీ మరియు ముంబై నుంచి బీహార్ కు విమానంలో తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చింది.
21 రోజుల లాక్డౌన్ సమయంలో ఏదైనా మానవతా మిషన్ కోసం విమానం మరియు సిబ్బంది సభ్యుల సేవలను ప్రభుత్వానికి అందిస్తామని చైర్మన్ & ఎండి అజయ్ సింగ్ అన్నారు. వలస కార్మికులు, ముఖ్యంగా బీహార్ నుండి వచ్చిన వారి బాధలను తగ్గించడానికి ఢిల్లీ, ముంబై నుండి పాట్నాకు కొన్ని విమానాలను నడపడానికి ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉందని తెలిపారు.
ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలను నిషేధించారు. అయితే ఇండిగో, గో ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు తమ విమానాలను, సిబ్బందిని కరోనావైరస్ వ్యాప్తి నివారణకు తీసుకునే చర్యలకు గానూ అవసరమైన ఏదైనా మిషన్ కోసం ప్రభుత్వానికి అందించాయి.
భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు నేటికి 724 కి చేరుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి గురువారం 85కి పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం రోగులలో 677 మంది భారతీయులు, 47 మంది విదేశీ పౌరులు ఉన్నారు.
ప్రస్తుతం, దేశంలో 640 క్రియాశీల కరోనావైరస్ రోగులు ఉన్నారు. మొత్తం 67 మంది రోగులకు నయం అయిందని వారు డిశ్చార్జ్ అయ్యారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.