రూ.59కే హెటిరో కరోనా మందు….ఫావివర్‌ మార్కెట్లో లభ్యం

  • Publish Date - July 30, 2020 / 08:35 AM IST

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్ధ కరోనా కు సంబంధించి తక్కువ ధరలో మందును అందుబాటులోకి తీసుకు వచ్చింది. బుధవారం జులై29 నుంచి ఈ మందు మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమిడిసివిర్‌కు జెనిరిక్ మందుగా కోవిఫర్ పేరుతో ఇంజెక్షన్ ను అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ తక్కవు ధరకు టాబ్లెట్ ను విడుదల చేసింది.

కరోనాకు మందుగా ‘ఫావివిర్’ పేరుతో ట్యాబ్సెట్లను భారత్‌ మార్కెట్ లో విడుదల చేసింది. ఒక ఫావివిర్ టాబ్లెట్ ధర రూ.59. హెటిరో హెల్త్ కేర్ లిమిటెట్ ఈ ఔషధాన్ని మార్కెటింగ్, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని మందుల దుకాణాలు, ఆస్పత్రి ఫార్మసీల్లో ఫావివిర్ అందుబాటులో ఉంటుంది. ఐతే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందులను ఇస్తారు. అని సంస్ధ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు మరి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని రకాల మందులు ఇప్పటికే కరోనాను ఎదుర్కోగుగుతున్నాయి. ఆ మందుల వాడకం ద్వారా రికవరీ శాతం ఎక్కువగానే ఉంది. రెమిడెసివిర్‌కు జనరిక్ రూపంలో హెటిరో విడుదల చేసిన ఫావిపిరావిర్‌ను కరోనావైరస్ వ్యాధి ప్రాథమిక, మధ్యస్థ దశలో ఉన్నప్పుడు వాడతారు.

నోటి ద్వారా టాబ్లెట్ రూపంలో తీసుకునే ఫావిపిరవిర్ డ్రగ్‌ను ఉత్పత్తి చేసి, మార్కెటింగ్ చేసుకునేందుకు హెటిరో సంస్ధకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. హెటిరో కంపెనీ విడుదల చేసిన రెండో కరోనా ఔషధమిది.